- Telugu News Business Personal finance Are you giving more than 20 thousand in cash What do the IT rules say
Income Tax: రూ.20 వేలకు మించి ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా? భారీగా పెనాల్టీ.. ఐటీ శాఖ ఏం చెబుతుందంటే..?
కొంతమంది నగుదు రూపంలో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం చేస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దీనికి కూడా ఐటీ శాఖ కొన్ని నిబంధనలు విధించింది. ఇవి పాటించకపోతే మీరు భారీ పెనాల్టీ కొట్టే ప్రమాదముంది. ఎలా అంటే..
Updated on: Dec 05, 2025 | 12:06 PM

బ్లాక్‌మనీ, ట్యాక్స్ ఎగవేతదారులను అరికట్టేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అనేక కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. బ్యాంకు లావాదేవీలు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లపై కొన్ని పరిమితులు విధించింది. మీరు అంతకంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చూస్తే ఐటీ శాఖ నిఘాలోకి వెళ్తారు. మీ ఆదాయం కంటే ఎక్కువ డబ్బలుు మీరు ఖర్చు పెడుతున్నా లేదా ఆదాయానికి మంచి బ్రాంక్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నా మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి చిక్కులు ఎదురుకావొచ్చు.

బ్యాంకు ట్రాన్సాక్షన్లపై కొన్ని పరిమితులు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగితే భారీగా పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. కొంతమంది చేబదుళ్లు తీసుకుంటూ ఉంటారు. రూ.20 వేల కంటే ఎక్కువ డబ్బులు ఇలా చేతులు మారకూడదని ఐటీ శాఖ నిబంధనలు చెబుతున్నాయి. అంతకంటే ఎక్కువ జరిగితే ఐటీ శాఖ చర్యలు తీసుకోవచ్చు.

ఇక సెక్షన్ 269SS ప్రకారం మీరు ఫ్రెండ్స్ లేదా బంధువుల నుంచి లోన్ లేదా డిపాజిట్ రూపంలో రూ.20 వేలు నగదు రూపంలో తీసుకుంటే సెక్షన్ 271D ప్రకారం మీకు పెనాల్టీ పడొచ్చు. ఇక తిరిగి చెల్లించే విషయంలో కూడా అలాగే పెనాల్టీ పడుతుంది. ఉదాహరణకు మీరు రూ.30 వేలు తీసుకుంటే రూ.30 వేల పెనాల్టీ పడొచ్చు.

ఇక బిజినెస్ లావాదేవీలకు సంబంధించి ఒక రోజులో ఒక వ్యక్తి ఒక లావాదేవీ కింద రూ.2 లక్షల కంటే ఎక్కువ డబ్బులు తీసుకోకూడదు. ఇలా తీసుకున్నా మీకు పెనాల్టీ పడే అవకాశముంది. అయితే ఈ నిబంధనల నుంచి తప్పించుకోవాలంటే మీరు కొన్ని మార్గాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

మీరు రూ.20 వేల కంటే ఎక్కువ డబ్బులను తీసుకునేటప్పుడు యూపీఐ, నెఫ్ట్, RTGS, కార్డ్ పేమెంట్స్ వంటి మార్గాల ద్వారా పేమెంట్ చేయాలి. తిరిగి చెల్లించేటప్పుడు కూడా ఇదే విధానంలో చేయాలి, దీని వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి కూడా ఎలాంటి సమస్యలు లేవు. అదే నగదు రూపంలో ట్రాన్సాక్షన్లు చస్తే మీరు న్యాయమపరమన చిక్కులు ఎదుర్కొవచ్చు.




