AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: యుద్దం ఎఫెక్ట్.. బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఆమాంతం పెరిగిన రేట్లు.. ఇప్పుడు ఎంతంటే..?

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై శనివారం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. దీని ప్రభావం మార్కెట్లపై పడింది. ఈ క్రమంలో పసిడి ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు.

Gold Prices: యుద్దం ఎఫెక్ట్.. బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఆమాంతం పెరిగిన రేట్లు.. ఇప్పుడు ఎంతంటే..?
Gold
Venkatrao Lella
|

Updated on: Mar 01, 2026 | 6:50 AM

Share

అమెరికా-ఇరాన్ మధ్య యుద్దంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి. దీంతో పసిడిలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో కొనుగోలుదారుల నుంచి డిమాండ్ వెల్లువెత్తడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. యుద్దం ముగిసేంతవరకు రేట్లు ఇంకా పెరిగే అవకాశముంది. ఖమేనీ మరణించినా ఇరాన్‌పై యుద్దం కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఉద్రిక్తతలు చల్లారే వరకు బంగారం ధరలు ఆకాశాన్నంటుతునున్నాయి. ఆదివారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

బంగారం ధరలు ఇలా..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,68,710 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,54,650 వద్ద ట్రేడవుతోంది

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ధర రూ.1,68,710 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,54,650 వద్ద ఉంది

-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,69,640 వద్ద ఇవాళ కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,55,500 వద్ద ఉంది

-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,68,710 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,650 వద్ద ఉంది

-దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,68,860 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,54,800 వద్ద ట్రేడవుతోంది

వెండి ధరలు చూస్తే..

-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.95 లక్షల వద్ద కొనసాగుతోంది -హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3.20 లక్షల వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి -చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.3.20 లక్షల వద్ద కొనసాగుతోంది -బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2.95 లక్షల వద్ద ట్రేడవుతోంది

Follow Us