AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిని ప్రేమలో పడేయాలంటే ఈ పాటే.. కుర్రాళ్లు తెగ పాడుకున్న సాంగ్.. 25 ఏళ్లైన తగ్గని క్రేజ్

సంగీతం అనేది మానసిక ఉల్లాసాన్ని ఉత్సహాన్ని పెంచడమే కాకుండా మనసుకు హాయిని కూడా కలిగిస్తుంది. చాలా మంది మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సినిమా సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు విజయాలను అందుకున్నా అందుకోకున్నా సాంగ్స్ మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంటుంటాయి.

అమ్మాయిని ప్రేమలో పడేయాలంటే ఈ పాటే.. కుర్రాళ్లు తెగ పాడుకున్న సాంగ్.. 25 ఏళ్లైన తగ్గని క్రేజ్
Song
Rajeev Rayala
|

Updated on: Apr 11, 2026 | 7:12 PM

Share

సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటుంటారు. సంగీతానికి వర్షం కురుస్తుందని అంటుంటారు. అందులో నిజమెంతుందో తెలియదు కానీ.. సంగీతం వల్ల మనసుకు ప్రశాంత, హాయి లభిస్తుంది. సినిమాల్లో పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నో రకాల సాంగ్స్ ఆకట్టుకుంటూ ఉంటాయి. సినిమా సాంగ్స్ తోపాటు జానపద గీతాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా సినిమాలు సాంగ్ వల్ల హిట్ అవుతుంటాయి. మ్యూజికల్ హిట్ గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక సినిమా సాంగ్స్ లో పేమగీతాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. లవ్ సాంగ్స్ కుర్రాళ్లు తెగ పాడుకుంటుంటారు. ఈ సాంగ్ ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రుతలూగించింది.

అప్పట్లో ఊపేసిన నాగమ్మ సీరియల్‌.. నాగదేవతగా చేసిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఈ సినిమా 2001లో విడుదలైంది. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యేయి. ముఖ్యంగా కుర్రాళ్లను ఈ సినిమా సాంగ్స్ తెగ ఆకట్టుకున్నాయి. ఆ సినిమా మరేదో కాదు.. రోహిత్ హీరోగా నటించిన 6 టీన్స్  . ఒకప్పుడు లవర్ బాయ్ గా రాణించాడు రోహిత్. 6టీన్స్, గర్ల్ ఫ్రెండ్, సొంతం, జానకీ వెడ్స్ శ్రీరామ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూత్ ను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు. అప్పట్లో రోహిత్ సినిమాలో సాంగ్స్ ను కుర్రాళ్లు తెగ పడుకునేవారు. వాటిలో 6టీన్స్ మూవీ సాంగ్స్ ఎక్కువగా ఉండేవి.

రఘువరన్ చివరి రోజుల్లో అంత బాధను అనుభవించారా.! మద్యానికి బానిసై చివరకు

వాటిలో దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే అనే సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ అప్పట్లో చాలా పాపులర్. ఎక్కడ విన్నా ఇదే సాంగ్ వినిపించేది. అమ్మాయిలు తమ లవర్స్ ను ఇంప్రెస్ చేయడానికి ఈ పాటను తెగ పాడేవారు. ఇప్పటికీ ఈ సాంగ్ చాలా మంది వింటుంటారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ మారుమ్రోగుతుంది. ఈ సాంగ్ కు నెటిజన్స్ మరీ ముఖ్యంగా 90స్ కిడ్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. “మనకు ఆస్తులు వున్నా లేకున్నా మనం 90”s లో పుట్టడం మాత్రం ఒక గొప్ప వరం చాలా బాగుండేవి ఆ  రోజులు”. “ఈ సాంగ్ విన్నటున్నన్నప్పుడు మళ్ళీ ఆ రోజుల్లో కీ వెళ్ళపోవాలని అనిపిస్తుంది”. “నా టీనేజ్ లో ఎక్కువ గా విన్న, ఎక్కువ గా ఫీల్ అయినా పాట ఇదే, 2001వేసవిలో విడుదలైన మూవీ, ఆ టైమ్ లో పెళ్లిళ్లు లో, మైకుల్లో చాలా బాగా వినిపించే పాట” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్.. టాలీవుడ్‌లో తోప్.. ఎవరో గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిదంబర రహస్యం అంటే ఏమిటి? గర్భగుడి తెర వెనుక ఆధ్యాత్మిక సత్యం ఇదే
చిదంబర రహస్యం అంటే ఏమిటి? గర్భగుడి తెర వెనుక ఆధ్యాత్మిక సత్యం ఇదే
టెస్ట్ క్రికెట్‌కి కొత్త హీరో వచ్చేశాడు..!
టెస్ట్ క్రికెట్‌కి కొత్త హీరో వచ్చేశాడు..!
11 లక్షలతో తీసిన బాసింగా బలాలు సాంగ్.. ఎంత వచ్చిందంటే..
11 లక్షలతో తీసిన బాసింగా బలాలు సాంగ్.. ఎంత వచ్చిందంటే..
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్.. కట్‌చేస్తే.. ఆ జట్టు ఔట్..?
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్.. కట్‌చేస్తే.. ఆ జట్టు ఔట్..?
వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..
వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..
ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా
ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా
వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..
వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..
ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..
ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..
8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..