AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: ఆధార్-పాన్ లింక్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం.. ఇలా చేస్తే కుదరదట.. మళ్లీ చేసుకోండి..

ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి అనేది మనందరికీ తెలిసిందే. డిసెంబర్ 31లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. లేకపోతే మీ పాన్ కార్డు రద్దు చేస్తారు. దీని వల్ల మీరు ఆర్ధికంగా ఎలాంటి లావాదేవీలు చేయలేరని కేంద్రం చెబుతోంది.

Pan Card: ఆధార్-పాన్ లింక్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం.. ఇలా చేస్తే కుదరదట.. మళ్లీ చేసుకోండి..
Aadhar And Pan
Venkatrao Lella
|

Updated on: Dec 05, 2025 | 11:24 AM

Share

Aadhar-PAN Link: ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది. ఎప్పటికప్పుడు ఇందుకు గడువు పొడిగిస్తున్న ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్.. ఈసారి ఏడాది చివరి వరకు టైమ్ ఇచ్చింది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటికీ ఇంకా లింక్ చేసుకోనివారు వెంటనే చేసుకోవడం మంచిది. ఇప్పటికే అనేసార్లు ఇందుకు గడువు పొడించారు. దీంతో ఈ సారి మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉందా? లేదా? అనేది అనుమానంగానే ఉంది. ఒకవేళ మీరు ఆధార్-పాన్ లింక్ చేసుకోకపోతే గడువు తేదీ తర్వాత మీరు ఇబ్బందులు పడే అవకాశముంది. పాన్ కార్డులను రద్దు చేసే అవకాశముంది. దీని వల్ల మీరు ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించలేరు.

అయితే కొంతమంది ఆధార్ కార్డుతో కాకుండా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్‌తో పాన్ కార్డు పొంది ఉంటారు. ఇలాంటివారు ఆధార్ నమోదు సంఖ్యతో పాన్ లింక్ అయి ఉంటుందని, తాము మళ్లీ లింక్ చేయాల్సిన అసవరం లేదనుకుంటారు. కానీ అలా కుదరదట. కేవలం ఆధార్ కార్డు నెంబర్‌తో పాన్ కార్డును లింక్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివారు కూడా డిసెంబర్ 31లోపు ఆధార్ నెంబర్‌తో పాన్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. చేయకపోతే జనవరి 1 నుంచి పాన్ కార్డులు ఇనాక్టివ్ అయ్యే అవకాశముంది. లింక్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఉచితంగా చేసుకోవచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 139 ఏఏ (2ఏ) ప్రకారం ఆధార్‌తో పాన్ లింక్ చేయడం అనే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2017, జూలై 1 కంటే ముందు పాన్ కార్డు పొందిన వారందరూ లింక్ చేసుకోవాలి. ఆ తర్వాత పొందినవారు కూడా తమ ఆధార్‌తో పాన్ లింక్ అయిందో.. లేదో చూసుకోవాలి. లేకపోతే వెంటనే చేసుకోవావాలని కేంద్రం పదే పదే చెబుతోంది. ఇప్పటికీ కొంతమంది ఇంకా లింక్ చేసుకోలేదని ఇన్‌కమ్ ట్యాక్స్ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వీరి కోసం డిసెంబర్ 31 వరకు డెడ్ డైన్ విధించింది.

Follow Us
నాన్ వెజ్ తినేవారికి షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా..?
నాన్ వెజ్ తినేవారికి షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా..?
దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ, పివీ సింధు..
దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ, పివీ సింధు..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు