AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మొదలైన యుద్ధం

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మొదలైన యుద్ధం

Phani CH
|

Updated on: Feb 28, 2026 | 9:29 PM

Share

ఇజ్రాయెల్ ఇరాన్‌పై భీకర దాడులు చేసింది, టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ తన భద్రత కోసమే దాడులు చేసిందని ప్రకటించగా, ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందనే భయాలు పెరుగుతున్నాయి. ఈ ఘర్షణ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచింది. ఇరు దేశాల సైనిక బలం, ఆయుధ సంపత్తిని విశ్లేషిస్తూ, ఈ సంఘర్షణ ప్రపంచ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలించాలి.

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది.. శనివారం ఉదయం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి.. ఒక్కసారిగా.. ఇజ్రాయెల్‌ మిసైళ్లతో దాడులు నిర్వహించింది. ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోత మోగింది. ఇజ్రాయెల్ దాడుల్లో పలు ప్రాంతాల్లో భీకర వాతావరణం నెలకొంది.. పలు భవనాలు నేలమట్టమయ్యాయి.. ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ 86 ఏళ్ల ఖమేనీ కార్యాలయాలు లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు కలిసి దాడులు చేసాయి. ఆ కార్యాలయాల సమీపంలోనే బాంబులు పేలినట్లు సమాచారం. దాడులు జరిగిన టైంలో కార్యాలయంలో ఖమేనీ ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. గత కొన్ని వారాలుగా ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారు. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ వెంటనే గగనతలాన్ని మూసివేసింది. మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ని సురక్షిత ప్రాంతానికి తరలించింది. తాము ఇరాన్‌పై దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు పొంచి ఉన్న ముప్పును తొలగించేందుకే ఈ ఎటాక్స్ చేశామని స్పష్టం చేశారు. టెహ్రాన్‌పై తాము చేసిన దాడిలో ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారు అనేది ఇంకా స్పష్టంగా తెలియదని ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ దాడిపై అమెరికా ఇప్పటివరకు స్పందించలేదు. ఇజ్రాయెల్‌లో ఎమర్జన్సీ ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడికి ప్రతిగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తుందనే ఆందోళనలు పెరిగాయి. ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతున్నాయి. బంకర్లలో దాక్కోవాలి అంటూ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మెసేజ్‌లను పంపుతోంది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుందా ? తమ దేశంపై దాడి జరిగితే, ఊరుకునేది లేదని బలంగా ప్రతిఘటిస్తామని గతంలో ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ తప్పక ప్రతిదాడి చేస్తుందనే అంచనాలు వస్తున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఇజ్రాయెల్‌లోని ఇండియన్‌ ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు ఎక్కడ ఉన్నా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పింది. అత్యవసరం అయితే తప్ప.. బయటకు రావొద్దని హెచ్చరించింది భారత ఎంబసీ.. ఇప్పటికే, తమ తమ దేశ ప్రజలు ఇరాన్ వీడాలంటూ భారత్ సహా పలు దేశాలు ప్రకటనలు చేశాయి. ఇజ్రాయెల్‌ Vs ఇరాన్: ఈ దేశాల సైన్యం బలం ఎంత..? ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి చూసినట్లయితే.. ఇరాన్ సంఖ్యాబలం, క్షిపణులు, డ్రోన్‌లు, ప్రాక్సీ నెట్‌వర్క్‌పై ఆధారపడితే, ఇజ్రాయెల్ అధునాతన సాంకేతికత, F-35 జెట్‌లు, ఐరన్ డోమ్, స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యంతో పాటు అమెరికా మద్దతుతో బలంగా ఉంది. రెండు దేశాల మధ్య సంఘర్షణ తీవ్రమైంది. అంతర్జాతీయ రక్షణ అంచనాల ప్రకారం, ఇరాన్‌కు సుమారు 5 నుంచి 6 లక్షల వరకు క్రియాశీల సైనిక బలం ఉంది. అదనంగా, Islamic Revolutionary Guard Corps (ఇస్లామిక్ విప్లవ రక్షక దళం) కింద సుమారు 1.5 నుంచి 2 లక్షల వరకు ప్రత్యేక బలగాలు ఉన్నట్టు భావిస్తున్నారు. మొత్తం కలిపి 7–8 లక్షల మధ్య సైనిక సిబ్బంది ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ వైమానిక దళంలో 1979 విప్లవానికి ముందు కొనుగోలు చేసిన పాత యుద్ధ విమానాలు ఇంకా సేవలో ఉన్నప్పటికీ, దేశం స్వదేశీ క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు (డ్రోన్లు) తయారు చేసే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. పాశ్చాత్య రక్షణ నివేదికల ప్రకారం, ఇరాన్ వద్ద వేల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్టు అంచనా. వీటిలో కొన్నివరకు ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగల దూర పరిధి కలిగి ఉన్నాయని చెబుతున్నారు. ఇరాన్ ప్రభావం కేవలం ప్రత్యక్ష సైనిక శక్తికే పరిమితం కాదు. లెబనాన్‌లోని Hezbollah (హిజ్బుల్లా), గాజాలోని Hamas (హమాస్), యెమెన్‌లోని Houthi movement (హౌతీ ఉద్యమం) వంటి మిత్ర గుంపులతో ఏర్పడిన ప్రాంతీయ మద్దతు వలయం కూడా కీలకంగా భావిస్తున్నారు. అయితే గత ఏడాది జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ మద్దతు వలయంపై ఒత్తిడి పెరిగినట్టు విశ్లేషణలు సూచిస్తున్నాయి. అమెరికా తయారీ F-35 Lightning II (ఎఫ్-35 మెరుపు–2 యుద్ధ విమానం) వంటి అత్యాధునిక గుప్త సామర్థ్య యుద్ధ విమానాలు దళంలో ఉన్నాయి. మొత్తం మీద యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు కలిపి వందల సంఖ్యలో వైమానిక వనరులు ఉన్నట్టు రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు.భూమిపై ఆధునిక ట్యాంకులు, సాయుధ వాహనాలు, సముద్రంలో క్షిపణి నౌకలు, జలాంతర్గాములు కూడా ఇజ్రాయెల్‌కు ఉన్నాయి. అదనంగా, Iron Dome (ఐరన్ డోమ్ వాయు రక్షణ వ్యవస్థ) రాకెట్ దాడులను అడ్డుకునే సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే భారీ స్థాయి దాడుల సమయంలో సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి లభిస్తున్న ఆర్థిక, రక్షణ సహకారం కూడా కీలక అంశంగా పరిగణించబడుతోంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికి ఉండటం, ఇజ్రాయెల్‌కు వ్యూహాత్మక మద్దతు అందిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఇరాన్ తన క్షిపణి, మానవరహిత వైమానిక వాహనాల సామర్థ్యాలు, ప్రాంతీయ మిత్ర బలగాలపై ఆధారపడుతుండగా, ఇజ్రాయెల్ అధునాతన సాంకేతికత అంతర్జాతీయ మద్దతుతో ముందుకు సాగుతోంది. ఈ ఉద్రిక్తతలు మరింత విస్తరించే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాంతీయ స్థిరత్వంపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందన్నది ప్రపంచ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు

Gold & Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే

18 లక్షల సార్లు స్కిప్పింగ్‌ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ

Follow Us