AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight Services: విమానం ఆలస్యమైతే హోటల్‌లో వసతి ఫ్రీ.. ఇండియాలో ప్రయాణికుల హక్కులు మీకు తెలుసా..?

విమానాలు చివరి నిమిషంలో రద్దు అవుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇలాంటప్పుడు ప్రయాణికులకు అనేక హక్కులు ఉన్నాయి. DGCA కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. వీటి ద్వారా ప్రయాణికులు పరిహారం పొందవచ్చు.

Flight Services: విమానం ఆలస్యమైతే హోటల్‌లో వసతి ఫ్రీ.. ఇండియాలో ప్రయాణికుల హక్కులు మీకు తెలుసా..?
Flight
Venkatrao Lella
|

Updated on: Dec 05, 2025 | 1:00 PM

Share

Flight Ticket: విమానం ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటం..  చివరకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పడం వంటి ఘటనలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొసారి గంటలపాటు విమానం ఆలస్యమవుతుంది. దీని వల్ల అత్యవసర ప్రయాణం చేసేవారు ఇబ్బందులు పడతారు. ఇటీవల దేశంలో విమానాలు రద్దు అవుతున్న సంఘటనలు భారీగా పెరిగిపోయాయి. ఇండిగో విమానాలు భారీగా ఇటీవల రద్దు అవుతూ వార్తల్లోకెక్కుతోంది. ఈ తరుణంలో అసలు విమానాలు రద్దు అయితే ప్రయాణికులకు ఎలాంటి హక్కులు ఉంటాయి? డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(DGCA) నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలు చూద్దాం.

విమానయాన సంస్థలు ఏం చేయాలి..?

-ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలో ముందుగానే ప్రయాణికులకు సమాచారం ఇవ్వాలి.

-విమానం 2 గంటల కంటే ఎక్కువసేపు ఆలస్యమైతే వసతి, భోజన సౌకర్యం కల్పించాలి.

-ఇక 24 గంటల కంటే ఎక్కువ లేట్ అయితే హోటల్ వసతితో పాటు స్థానికంగా వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా కల్పించాలి.

-ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ అందజేయాలి

ప్రయాణికుల హక్కులు ఇవే

-ప్రయాణికులు ఫుల్ రీఫండ్ అయినా తీసుకోవచ్చు లేదా ఉచితంగా వేరే విమానంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు

-విమానయాన సంస్థ లగేజీ పొగోడితే పరిహారం అడగవచ్చు

-ఓవర్ బుకింగ్ వల్ల సీటు దొరక్కపోతే రీఫండ్, పరిహారం రెండూ కోరవచ్చు

-విమాన ఆలస్యం, క్యాన్సిల్‌పై సమాచారం పొందే హక్కు ఉంటుది

-7 రోజుల ముందే టికెట్ బుక్ చేసి విమాన ప్రయాణానికి 24 గంటల ముందు రద్దు చేస్తే పూర్తి రీఫండ్ ఇవ్వాలి

-వాతావరణం అనుకూలించకపోవడం, టెక్నికల్ సమస్యల వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయితే పూర్తి రీఫండ్ ఇస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో పరిహారం చెల్లించరు.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్