AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు ముఖ్యమంత్రి కూడా.. ఎవరంటే.?

జయలలిత ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్‌గా రికార్డు సృష్టించారు. అంతేకాదు, ఆమె స్వయంగా ముఖ్యమంత్రి కావడం విశేషం. ఆమె సినీ కెరీర్‌లో ఎం.జి. రామచంద్రన్(ఎం.జి.ఆర్)తో కలిసి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ వార్తలో తెలుసుకుందామా..

Tollywood: ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు ముఖ్యమంత్రి కూడా.. ఎవరంటే.?
Actress
Ravi Kiran
|

Updated on: Feb 28, 2026 | 10:09 PM

Share

నటిగా జయలలిత అరుదైన రికార్డు సృష్టించారు. ఆమె ఎం.జి.ఆర్, కరుణానిధి, ఎన్టీఆర్‌లతో నటించి ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్‌గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఆమె కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. జయలలిత ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్‌గా రికార్డు సృష్టించారు. అంతేకాదు, ఆమె స్వయంగా ముఖ్యమంత్రి కావడం విశేషం. ఆమె సినీ కెరీర్‌లో ఎం.జి. రామచంద్రన్(ఎం.జి.ఆర్)తో కలిసి ఆయిరత్తిల్ ఒరువన్, ఎంగ వీట్టు పిళ్ళై, రక్షాకారన్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అప్పటికే మెగాస్టార్‌గా ఉన్న ఎం.జి.ఆర్, ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తెరపై వారి కెమిస్ట్రీ అద్భుతం.

తమిళనాడు రాజకీయాల్లో ఎం.జి.ఆర్‌కు బద్ధ శత్రువైన ఎం. కరుణానిధి కూడా ప్రముఖ రచయిత, స్క్రీన్ ప్లే రైటర్. కరుణానిధి రాసిన స్క్రీన్ ప్లేలతో కొన్ని చిత్రాలలో జయలలిత నటించారు. ఆయన కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాలించారు. రాజకీయంగా తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, సినీ రంగంలో వారిద్దరికీ పరోక్షంగా సంబంధం ఉంది. తెలుగు సినీ చరిత్రలో నటసార్వభౌముడు, ఒకప్పుడు ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఎన్టీఆర్‌తో కూడా జయలలిత నటించారు. ముఖ్యంగా 1973లో వచ్చిన దేవుడు చేసిన మనుషులు, కథానాయకుడు వంటి తెలుగు చిత్రాల్లో వారిద్దరూ తెరపై కనిపించారు. ఎన్టీఆర్ తెలుగునాట దైవ సమానుడిగా పూజలు అందుకుని, తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. తెరపై నటులుగా కలిసి పనిచేసి, ఆ తర్వాత వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మారిన ఈ గొప్ప వ్యక్తులతో జయలలితకు ఉన్న అనుబంధం భారతీయ సినిమా, రాజకీయాల మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని స్పష్టం చేస్తుంది.

Follow Us