పొలం గట్ల మధ్య ముద్దుగుమ్మ.. ఎర్ర చీరలో ఎంత ముద్దుగా ఉందో..
Samatha
11 April 2026
అందాల ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య గురించి ఎంత చెప్పినా తక్కువే. వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
వైష్ణవి చైతన్య
తర్వాత ఏకంగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి, తన అంద చందాలతో, నటనతో ఎంతో మంది మదిని దోచుకుంది.
వెండితెరపైకి ఎంట్రీ
ముఖ్యంగా ఒక్క యూట్యూబ్ షార్ట్ ఫిలింతో ఫేమస్ అయ్యి, కుర్రకారు మనసు దోచేసింది, యూత్ ఫేవరెట్ బ్యూటీ అయిపోయింది.
యూట్యూబ్ షార్ట్ ఫిలిం
ఇక దీని తర్వాత ఈ చిన్నదానికి ఏకంగా వెండితెరపై మెరిసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసింది.
వెండితెరపై ఛాన్స్
ఆనంద్ దేవరకొండ సరసన బేబీ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగింది.
బేబీ మూవీ
దీంతో ఈ బ్యూటీ పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ సరసనే మరో సినిమా చేస్తుంది.
ఫుల్ బిజీ
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా, ఎరుపు రంగు చీరలో మెరిసిపోయింది. పొలం గట్లపై కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చింది.
సోషల్ మీడియాలో యాక్టివ్
ఈ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. కొంత మంది బ్యూటి ఫుల్ అని కామెంట్ చేస్తే మరికొంత మంది సూపర్ అని కామెంట్ చేస్తున్నారు.