పురుషులకు ఎంట్రీ లేని ఆలయాలు ఇవే.. భారత్‌లో ఎక్కడున్నాయంటే?
Samatha
10 April 2026
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలకు ఎంట్రీ లేదు అనే విషయం తెలిసిందే. దీని పై కోర్టులో కేసు కూడా నడుస్తుంది.
శబరిమల స్త్రీలు
అయితే మహిళలే కాదు, భారత దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
పురుషులకు ఎంట్రీ లేని ఆలయాలు
భారతదేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి అయిన కామాఖ్య ఆలయం ఒకటి. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు ఆలయం మూసి వేస్తారు. ఆ సమయంలో ఈ గుడికి పురుషుల ప్రవేశం లేదంట.
కామాఖ్య ఆలయం
అట్టుకల్ భగవతి ఆలయం కేరళ, ఈ టెంపుల్‌ను మహిళల శబరి అని పిలుస్తారు. ఇక్కడ జరిగే అట్టుకల్ పొంగల పండుగ సమయంలో ఆలయంలోకి పురుషులకు ఎంట్రీ లేదంట.
అట్టుకల్ భగవతి ఆలయం కేరళ
అదే విధంగా తమిళనాడులోని కుమారి అమ్మన్ ఆలయం . ప్రసిద్ధ ఆలయాల్లో ఇదొక్కటి. అయితే ఈ టెంపుల్ గర్భగుడిలోకి వివాహిత పురుషులకు ఎంట్రీ లేదంట.
తమిళనాడులోని కుమారి అమ్మన్ ఆలయం .
చుక్కలతుకవు ఆలయం కేరళ. ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో నారీ పూజ చేస్తారు. ఈ సమయంలో పురుషులకు ఆలయంలోకి ఎంట్రీ లేదంట.
చుక్కలతుకవు ఆలయం కేరళ
బ్రహ్మ ఆలయం పుష్కర్ , రాజస్థాన్. భారత దేశంలోని అరుదైన ఆలయాల్లో ఇదొక్కటి, ఇక్కడి ఆలయంలోకి వివాహిత పరుషులకు ఎంట్రీ లేదంట.
బ్రహ్మ ఆలయం పుష్కర్ , రాజస్థాన్
సంతోషిమాత ఆలయం జోధ్ పూర్, రాజస్థాన్. ఈ ఆలయంలోకి శుక్ర వారం రోజు మాత్రమే గర్భ గుడిలోకి పరుషులకు ఎంట్రీ లేదు.