ఈ చిన్న చిట్కా ఫాలో అవుతే చాలు.. మీ గులాబీ చెట్టు గుబురుగా పూస్తుంది!
Samatha
09 April 2026
సమ్మర్ వచ్చేసింది. ఏప్రిల్ నెల కూడా ప్రారంభం కావడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగ భగలకు మనుషులు, మొక్కలు అల్లాడి పోతున్నాయి.
సమ్మర్
అందుకే తప్పకుండా సమ్మర్‌లో మొక్కల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు. లేకపోతే మొక్కలు ఎండి పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు
ముఖ్యంగా చాలా మందికి ఇంటిలో గులాబీ మొక్క ఉండటం చాలా ఇష్టం ఉంటుంది. ఇది వాడిపోతే చాలా బాధపడి పోతుంటారు. అందుకే సమ్మర్లో గులాబీ మొక్కపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంట.
గులాబీ మొక్క
గులాబీ మొక్కకు సమయానుగుణంగా నీళ్లు పోస్తూ ఉండటం వలన మొక్క ఎండిపోకుండా ఉండటమే కాకుండా, మొక్క ఆరోగ్యంగా ఉంటుందంట.
నీళ్లు పోయడం
మొక్కకు ఎప్పుడూ సాయంత్రం వేళల్లో మాత్రమే నీళ్లు పోయాలంట. ఇలా సాయంత్రం వేళల్లో మొక్కకు నీళ్లు పోయడం వలన మొక్క మొగ్గలు పెట్టడమే కాకుండా, చిగురిస్తుంది.
సాయంత్రం సమయం
ఇవే కాకుండా మొక్కలకు రెండు చెంచాల దాల్చిన చెక్క పొడి, కలబంద గుజ్జు వీటన్నింటి తీసుకొని మిక్సీలో పట్టుకొని, పేస్ట్ రెడీ చేసుకోవాలంట.
దాల్చిన చెక్క పొడి
తర్వాత దీనిని మూడు లీటర్ల నీటిలో కలిపి ప్రతి రోజూ గులాబీ మొక్కకు స్ప్రే చేయాలంట. దీన వలన మొక్క బలంగాతయారు అయ్యి, చెట్టు నిండా పూలను ఇస్తుందంట.
మూడు లీటర్ల నీరు
గులాబీ మొక్కకే కాకుండా, అన్ని రకాల పూల మొక్కలకు ఈ లిక్విడ్ ఉపయోగపడుతుందంట. దీనిని సమ్మర్ లో ఈవినింగ్ స్ప్రే చేయడం వలన మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.