AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

Phani CH
|

Updated on: Dec 05, 2025 | 12:55 PM

Share

క‌రోనా భయం తర్వాత ఏపీలో స్క్ర‌బ్ టైఫ‌స్ వ్యాప్తి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. నల్లి వంటి కీటకం కుట్టడం వల్ల సంక్రమించే ఈ వ్యాధికి జ్వరం, దద్దుర్లు ప్రధాన లక్షణాలు. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం, తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వైద్య సలహా, అవగాహనతో వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. అప్రమత్తంగా ఉండి, సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

క‌రోనా విలయం తర్వాత చీమ చిటుక్కుమన్నా ప్రజలు వణికిపోతున్నారు. కొత్త‌గా ఏదైనా వ్యాధి వ్యాప్తి చెందుతుందంటే ప్ర‌జ‌లు తీవ్ర భ‌య‌భ్రాంతుల‌కు గురౌతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం స్క్ర‌బ్ టైఫ‌స్‌ అనే మ‌రో వ్యాధి వ్యాప్తి చెందుతుండ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ కొత్త ర‌కం వ్యాధి హడలెత్తిస్తోంది..స్క్రబ్ టైఫస్ లక్షణాలతో విజయనగరంలో మహిళ మృతి చనిపోవడం సహా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. నల్లిని పోలిన కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతందంటున్నారు డాక్టర్లు. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడం, జ్వరం, వాంతులు,తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు నిపుణులు. లాలాజలంతో మనుషులకు ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.అలాగని ఈ ఇన్‌ఫెక్షన్‌ మనుషులలో నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదంటున్నారు వైద్యులు. తేమ ఎక్కువగా వున్నచోట ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఏపీలోస్క్రబ్ టైఫస్ వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగడం ఆందోళన కల్గిస్తోంది. అయితే అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్‌ క్యాంప్‌, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు . నలుసు లాంటి నల్లే కదా అని లైట్‌గా తీసుకోవద్దు. సకాలంలో స్పందించకుంటే, సకాలంలో చికిత్స అందకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు సహా కిడ్నీ సమస్యలు రావచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి మరణాల రేటు 6నుంచి 30శాతం ఉండే అవకాశం వుంది. స్క్రబ్ టైఫస్‌కి వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు 2శాతం లోపు తగ్గించొచ్చు అంటున్నారు నిపుణులు. ఓ వైపు దోమలు తెగ కుట్టేస్తున్నాయి. సందట్లో సడేమియాల్లా ఇప్పుడు నల్లులు కూడా కుడుతున్నాయి. మరో రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా గ్రామీణప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీటకం చిన్నదే కావచ్చు.. కానీ దాని ప్రభావం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తుంది. అలాగని జ్వరం రాగానే అదేనేమో అని భయపడాల్సిన పన్లేదు. అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. ఎందుకంటే ఇది ఫీవర్‌ సీజన్‌. బీఅలర్ట్ అంటున్నారు నిపుణులు‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు?

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక్‌

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్.. కన్ను పడిందా

Published on: Dec 05, 2025 12:09 PM