Aadhaar Card: త్వరలో కొత్త ఆధార్ కార్డు.. రూల్స్ మారబోతున్నాయ్.. పాత కార్డులు ఉండవా?
Aadhaar Card: ఆధార్ కాపీల దుర్వినియోగాన్ని నిరోధించడానికి కొత్త నియమాలను అభివృద్ధి చేస్తున్నట్లు యూఐడీఏఐ సీఈవో భువనేష్ కుమార్ ఆన్‌లైన్ సమావేశంలో అన్నారు. దీని తర్వాత మీ ఆధార్ కార్డు ఫోటోకాపీ చూసినా, సమర్పించినా మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. ఇతర..

Aadhaar Card: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును తిరిగి డిజైన్ చేయాలని పరిశీలిస్తోంది. భవిష్యత్తులో ఆధార్ కార్డులు కేవలం హోల్డర్ ఫోటో, QR కోడ్‌ను కలిగి ఉండవచ్చు. దీని అర్థం కార్డులో ఆధార్ నంబర్, పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీ లేదా ఇతర బయోమెట్రిక్ సమాచారం ఉండదు.
ఆధార్ కాపీల దుర్వినియోగాన్ని నిరోధించడానికి కొత్త నియమాలను అభివృద్ధి చేస్తున్నట్లు యూఐడీఏఐ సీఈవో భువనేష్ కుమార్ ఆన్‌లైన్ సమావేశంలో అన్నారు. దీని తర్వాత మీ ఆధార్ కార్డు ఫోటోకాపీ చూసినా, సమర్పించినా మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. ఇతర సంస్థలకు, ఇతర వ్యక్తులకు చేరవు.
ఇది కూడా చదవండి: Sankranti Holidays 2026: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?
ముఖ్యంగా హోటళ్ళు, టెలికాం సిమ్ కార్డ్ విక్రేతలు, కాన్ఫరెన్స్, సెమినార్ నిర్వాహకులు మొదలైన వారు మీ ఆధార్ ఫోటోకాపీని దుర్వినియోగం చేయలేరు. UIDAI డిసెంబర్ 2025 లో కొత్త నిబంధనలను అమలు చేయాలని యోచిస్తోంది.
ఈ మేరకు UIDAI త్వరలో కొత్త ఆధార్ మొబైల్ యాప్‌ను ప్రారంభించనుంది. ఈ యాప్ ఆధార్ హోల్డర్లు ఫోటోకాపీలు లేకుండా తమ గుర్తింపును డిజిటల్‌గా పంచుకోవడానికి, అన్ని లేదా ఎంచుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి అనుమతిస్తుంది. కొత్త యాప్ గుర్తింపును డిజిటల్‌గా పంచుకునే ప్రక్రియను మరింత సురక్షితంగా, సరళంగా, కాగిత రహితంగా చేస్తుంది.
ఇది కూడా చదవండి: Tejas Fighter Jet Price: దుబాయ్‌లో కూలిపోయిన భారత్ తేజస్ ఫైటర్ జెట్ ధర ఎంతో తెలుసా? దానికి బీమా ఉంటుందా?
కొత్త ఆధార్‌లో ఏమి జరుగుతుంది?
- భవిష్యత్తులో కార్డులో ఫోటో సెక్యూర్ QR కోడ్, పేరు మత్రమే ఉండవచ్చు. కానీ ఆధార్ నంబర్ కనిపించదు.
- QR కోడ్‌ను కస్టమ్ యాప్ లేదా యూఐడీఏఐ సర్టిఫైడ్ టూల్‌తో స్కాన్ చేయవచ్చు. దీని వలన వివరాలను ఆన్‌లైన్‌లో ధృవీకరించవచ్చు.
- ప్రస్తుతం ఆధార్ కార్డులలో పేరు, ఆధార్ నంబర్, ఫోటో, QR కోడ్ ఉంటాయి. ధృవీకరణ పద్ధతులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయి. ఆఫ్‌లైన్ ధృవీకరణ ఫోటోకాపీ, డేటా దుర్వినియోగం ప్రమాదాన్ని కలిగిస్తుంది.
మార్పు చేయడానికి కారణాలు..
- ఆధార్ కార్డులను పదే పదే కాపీ చేయడం వల్ల గుర్తింపు, డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. QR కోడ్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థ డిజిటల్ గుర్తింపును మరింత సురక్షితంగా చేసింది.
- కార్డుపై తక్కువ వివరాలు ఉండటం దుర్వినియోగం అయ్యే అవకాశాలు తగ్గుతాయి.
- ఆధార్ కార్డులో ఇతర సమాచారం లేకపోవడం నకిలీ పత్రాలు తయారు చేసే వారికి సవాలు విసురుతుంది.
ఇది కూడా చదవండి: Relationship Tips: ఎట్టి పరిస్థితుల్లో మీ భార్యతో ఈ విషయాలు మాట్లాడకండి.. మనస్పర్థలు వచ్చేస్తాయ్..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








