AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

గద్దర్ అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున  సినీ ప్రముఖులకు. యువనటులకు.. మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా గుర్తించింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్, ఐటీ, ఫార్మా పరిశ్రమలకు, బిర్యానీకి మాత్రమే కాదు దేశ స్థాయిలో సినిమాకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించనిలని ప్రభుత్వం భావిస్తుంది.

ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2026 | 11:16 PM

Share

గద్దర్ అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది సినీ ప్రముఖలు సినీ అభిమానులు అందరూ పాల్గొని.. ఉగాది సంబరాలు జరుపుకనే సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం తరుపున గద్దర్ ఫిలిం అవార్డస్ ఇవ్వటం.. మన బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ ఓ కేంద్రంగా రాణించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రామానాయుడు, కృష్ణ గారు అప్పట్లో తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కు రావడానికి వాళ్లు తీవ్రమైన కృషి చేసి రామోజీరావుగారు ఫిలిం సిటీ నిర్మించి ఇక్కడే పరిశ్రమ చిరస్థాయిగా ఉండేలా చేశారు. ప్రభాకర్ రెడ్డిగారు తన సొంత స్థలాన్ని కార్మికుల కోసం దానం చేశారు. దాసరి గారు సినీ పరిశ్రమ పెద్దగా అందరి సమస్యలు పరిష్కరిస్తూ ఇండస్ట్రీ ఇక్కడే ఉండేలా కృషి చేశారు.

ఈ రోజు ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం.. రెండో సంవత్సరం గద్దర్ అవార్డ్స్‌ కార్యకక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నాం..  నాగచైతన్య, రష్మిక లాంటి వాళ్లు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. వాళ్లను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన సీనియర్స్ అందరినీ అభినందిస్తున్నాను. ఈ రోజు జపాన్, కొరియా లాంటి దేశాల్లో ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నాయి.. అదే తరహాలో మన ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో రకాల సాంకేతిక పరమైన అభివృథ్ధిని సినిమా పరంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ హబ్‌గా మార్చేందుకు సినిమాలను ప్రోత్సహించేందుకు సినిమాలను ఇక్కడ నిర్మించాలనుకుంటే సింగిల్‌ విండో పద్దతిలో అన్ని అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని అనుమతులు ఆన్‌లైన్‌ ద్వారానే తీసుకునేలా ప్లాట్‌ ఫామ్ క్రియేట్ చేయాలని ఉప ముఖ్యమత్రి భట్టి విక్రమార్కగారికి సూచిస్తున్నా..

గద్దర్.. ప్రజాయుద్ధనౌక… సామాజిక రుగ్మతల మీద పోరాటం చేసిన వ్యక్తి. గద్దర్‌ గారిని తొలిసారి తెర మీద చూపించిన నిర్మాత కూడా ఇక్కడే ఉన్నారు. గద్దర్‌ ప్రభావం మొదటి తెలంగాణ ఉద్యమం, నక్సల్‌బరి ఉద్యమాల్లో గొంతుకగా నిలిబడ్డారు. గద్దర్ ఒక స్పూర్తి.. ఆయన స్పూర్తితోనే సామాజిక రుగ్మతల మీద పోరాటటం చేసేందుకు సినిమాను ఓ వెపన్ వాడాలని ఈ అవార్డ్స్ ఇస్తున్నాం. ఫిలిం ఇండస్ట్రీ సామాజిక సమస్య మీద పోరాటానికి తోడ్పడాలని మేం భావిస్తున్నాం.. హైదరాబాద్‌ సేఫెస్ట్ ఫ్లేస్‌ ఇన్‌ ద ఎర్త్‌ . దుబాయ్‌లో కాదు హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయండి.. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కి మా ప్రభుత్వం అష్యూరెన్స్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?