AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tejas Fighter Jet Price: దుబాయ్‌లో కూలిపోయిన భారత్‌ తేజస్ ఫైటర్ జెట్ ధర ఎంతో తెలుసా? దానికి బీమా ఉంటుందా?

Tejas Fighter Jet Price: మీడియా నివేదికల ప్రకారం.. తేజస్ రోజు ప్రదర్శన సమయంలో దాని చురుకుదనం, సామర్థ్యాలను ప్రదర్శిస్తోంది. అంతా సజావుగా జరుగుతుండగా విమానం అకస్మాత్తుగా తన పట్టును కోల్పోయింది. క్షణాల్లోనే విమానం నియంత్రణ కోల్పోయి అధిక వేగంతో నేలపై..

Tejas Fighter Jet Price: దుబాయ్‌లో కూలిపోయిన భారత్‌ తేజస్ ఫైటర్ జెట్ ధర ఎంతో తెలుసా? దానికి బీమా ఉంటుందా?
Subhash Goud
|

Updated on: Nov 22, 2025 | 6:30 AM

Share

Tejas Fighter Jet Price: దుబాయ్ ఎయిర్ షోలో టేకాఫ్ సమయంలో భారతీయ తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది . ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉండటంతో విమానం తక్షణమే మంటల్లో చిక్కుకుంది. ప్రమాదంలో పైలట్ మరణించాడు. ఈ తేజస్‌ ఫైటర్‌ జెట్‌ విలువ సుమారు 680 కోట్లు. ఇంతటి ఖరీదైన స్వదేశీ ఫైటర్ జెట్ ధ్వంసం అనేక ప్రశ్నలను లేవనెత్తింది . దేశానికి ఎంత ఆర్థిక నష్టం జరిగింది? ఈ జెట్‌కు బీమా ఉందా?

ప్రమాదం ఎలా జరిగింది?

మీడియా నివేదికల ప్రకారం.. తేజస్ రోజు ప్రదర్శన సమయంలో దాని చురుకుదనం, సామర్థ్యాలను ప్రదర్శిస్తోంది. అంతా సజావుగా జరుగుతుండగా విమానం అకస్మాత్తుగా తన పట్టును కోల్పోయింది. క్షణాల్లోనే విమానం నియంత్రణ కోల్పోయి అధిక వేగంతో నేలపై పడిపోయింది. నేలను ఢీకొన్నప్పుడు భారీ పేలుడు సంభవించింది. సంఘటన స్థలంలో పొగ, మంటలు మాత్రమే కనిపించాయి.

తేజస్ జెట్ నిజమైన ధర ఎంత ?

ఆర్థికంగా ఈ ప్రమాదం దేశానికి భారీ నష్టం. తేజస్ జెట్ కొన్ని నెలల క్రితం భారత ప్రభుత్వం HAL తో దాదాపు రూ. 62,370 కోట్ల విలువైన 97 తేజస్ Mk-1A విమానాల కోసం ఒప్పందంపై సంతకం చేసింది .

ఒక జెట్ విమానం సగటు ధర రూ. 680 కోట్లు:

పాత HAL రికార్డుల ప్రకారం.. ఎయిర్‌ఫ్రేమ్ ధర మాత్రమే దాదాపు రూ.309 కోట్లు. కానీ రాడార్, ఆయుధ వ్యవస్థలు, ఏవియానిక్స్ , సాఫ్ట్‌వేర్, గ్రౌండ్ సపోర్ట్, విడిభాగాల ఖర్చును కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు రూ.680 కోట్లు.

తేజస్ యుద్ధ విమానానికి బీమా ఉందా ?

ఈ ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. యుద్ధ విమానాలు సాధారణంగా కార్లు లేదా బైక్‌ల మాదిరిగా బీమా ఉండదు. ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నందున ఏ ప్రైవేట్ బీమా కంపెనీ కూడా సైనిక విమానాలను కవర్ చేయదు .

  • విమానం HAL కర్మాగారంలో లేదా పరీక్షా విమానంలో ఉన్నప్పుడు దాని పూర్తి బాధ్యత HAL పై ఉంటుంది .
  • కానీ ఆ విమానం అధికారికంగా భారత వైమానిక దళానికి ( IAF ) అప్పగించిన తర్వాత , అది దేశ ఆస్తిగా మారుతుంది.
  • యుద్ధ కార్యకలాపాలు, భద్రతా ప్రమాదాలు మరియు సాంకేతిక సవాళ్ల కారణంగా ఇటువంటి విమానాలను బాహ్య కంపెనీలు బీమా చేయవు.

ఇది కూడా చదవండి: Auto News: ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే 780 కి.మీ రేంజ్‌.. మార్కెట్‌ను షేక్‌ చేస్తున్న బైక్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి