AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto News: ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే 780 కి.మీ రేంజ్‌.. మార్కెట్‌ను షేక్‌ చేస్తున్న బైక్‌..!

Auto News: ఈ హోండా బైక్‌లో 163 సిసి సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ బైక్‌లోని ఈ ఇంజిన్ 13 బిహెచ్‌పి పవర్‌ని ఇస్తుంది. అలాగే 14.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఇంజిన్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ..

Subhash Goud
|

Updated on: Nov 19, 2025 | 8:25 PM

Share
 Auto News: గత సంవత్సరం చివరిలో కొత్త మోడల్ హోండా యునికార్న్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర బైక్‌లకు గట్టి పోటీనిచ్చేలా ఈ మోటార్‌సైకిల్‌లో అనేక కొత్త ఫీచర్లను చేర్చింది కంపెనీ. హోండా యునికార్న్ గత 20 సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది. అయితే ఈ 20 సంవత్సరాలలో ఆటోమేకర్లు మోటార్ సైకిల్ డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. హోండా యునికార్న్ ధర ఎంత? ఈ బైక్‌లో మీరు పొందే అప్‌డేట్‌ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

1 / 5
 హోండా యునికార్న్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. దీనితో పాటు LED హెడ్‌ల్యాంప్‌లు, సర్వీస్ రిమైండర్, 15 వాట్ల USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఈ మోటార్‌సైకిల్‌లో అందించింది. ఈ బైక్‌లో గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో ఇండికేటర్ కూడా ఉన్నాయి. మోటార్‌సైకిల్‌లోని ఈ కొత్త ఫీచర్లతో ఈ బైక్ అమ్మకాల ద్వారా హోండా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలనుకుంటోంది.

2 / 5
 హోండా యునికార్న్ శక్తి ఏమిటి?: ఈ హోండా బైక్‌లో 163 సిసి సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ బైక్‌లోని ఈ ఇంజిన్ 13 బిహెచ్‌పి పవర్‌ని ఇస్తుంది. అలాగే 14.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఇంజిన్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. దీనితో పాటు, OBD2 (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్ 2) కూడా ఇన్‌స్టాల్ చేసింది. దీని కారణంగా ఈ బైక్ పరిమితి కంటే ఎక్కువ కాలుష్యం చేయదు.

3 / 5
 హోండా యునికార్న్ ARAI క్లెయిమ్ చేసిన మైలేజ్ లీటరుకు 60 కిలోమీటర్లు. దీని ఇంధన సామర్థ్యం 13 లీటర్లు. దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే 780 కిలోమీటర్ల వరకు నడపవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

4 / 5
 హోండా యునికార్న్ కొత్త మోడల్ ధర ఎంత?: ముంబైలో హోండా యునికార్న్ కొత్త మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 1.34 లక్షల వరకు ఉంటుంది. అయితే మోడల్‌ను బట్టి ఉంటుందని గుర్తించుకోండి. అలాగే ప్రాంతాన్ని బట్టి ధరలో తేడా ఉండవచ్చు. కొత్త హోండా బైక్ మార్కెట్లో మూడు రంగు ఎంపికలతో లభిస్తుంది. ఇది మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, రేడియంట్ రెడ్ మెటాలిక్ కలర్లలో లభిస్తుంది.

5 / 5