AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్ ఏం లేదు.. ఇక అంతా ఒకటే.. వన్‌ ఇండియన్ సినిమా: కమల్ హాసన్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్‌గా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, టీఎఫ్‌డీసీ దిల్‌ రాజు హాజరయ్యారు.

టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్ ఏం లేదు.. ఇక అంతా ఒకటే.. వన్‌ ఇండియన్ సినిమా: కమల్ హాసన్
Gaddar Film Awards
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2026 | 11:30 PM

Share

గద్దర్ అవార్డుల వేడుకలో కాంతారావు అవార్డ్‌ అందుకున్న నటుడు ఆర్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ..  గత 13 ఏళ్లు నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారా.. అని ఎదురుచూశాం. డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం మన రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం ఈ అవార్డులు తిరిగి ప్రారంభించి మళ్లీ ఇప్పుడు ఘనం జరుపుతున్నందుకు ఇంత మందిని హానర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. గద్దర్ గారు అన్నమయ్య, రామదాసు లాంటి ప్రజా వాగ్గేయకారుడు. ఆయన పీపుల్స్ లెజెండ్‌. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డు ఇస్తున్నందుకు సెల్యూట్‌. కాకతీయ అవార్డు, వెయిస్తాంబాల అవార్డు అని కాకుండా గద్దర్‌ పేరు మీద అవార్డ్ ఇవ్వటం గొప్ప విషయం. తెలంగాణ కళాకారులు చెన్నైకి ఎక్కువగా రాలేదు.. వచ్చిన వాళ్లలో కాంతారావు గారు అగ్రగణ్యులు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ గారితో ఢీ అంటే ఢీ అన్న లెజెండ్ ఆయన రామారావుగారి తరువాత అన్ని వేశాలు వేసి మెప్పించిన నటుడు కాంతారావు. ఆయన అవార్డు నాకు ఇవ్వటం గర్వం కారణం. చంద్రబాబు నాయుడు గారు… ఇక్కడ రేవంత్‌ రెడ్డిగారు దూసుకెళ్లిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మీకు కూడా దయ ఉంచి నందీ అవార్డ్స్ ఇవ్వండి సార్‌.. అని నారాయణమూర్తి ప్రసంగాన్ని ముగించారు.

అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయసులో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన శ్రీమంతుడు సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా హైదరాబాద్‌ వచ్చాను నేను. అప్పటి నుంచి నాకు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. సింగీతం గారితో కలిసి నేను 50 ఏళ్లుగా వర్క్ చేస్తున్నాను. ఆయనకు అవార్డ్‌ ఇవ్వటం మాకు కూడా గర్వ కారణం. చిరంజీవి గారు పాలిటిక్స్‌లో నా సీనియర్‌.. సినిమాల్లో నా జూనియర్‌. ఇప్పుడు మేం 70స్‌లో ఉన్నాం.. గద్దర్‌ పేరు మీద అవార్డ్‌ ఇవ్వటం చాలా బాగుంది. ఆయనకు ఉన్న మిలియన్ల ఫ్యాన్స్‌లో నేను కూడా ఒకడిని.. ఒక పోయట్‌, రెవెల్యూషనరీని ఇలా గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక టాలీవుడ్‌ కోలీవుడ్ బాలీవుడ్ ఏం లేదు.. ఇక అంతా ఒకటే.. వన్‌ ఇండియన్ సినిమా. నాకు అవార్డు ఇచ్చినందుకు మాత్రమే కాదు.. ఇక్కడి పిలిచినందుకు.. నంది అవార్డ్స్‌ ను మళ్లీ గద్దర్ అవార్డ్స్ పేరుతో ఇస్తున్నందుకు ధన్యవాదాలు అని కమల్ హాసన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
డిమాన్ గొడవపై రీతూ చౌదరీ పోస్ట్..
డిమాన్ గొడవపై రీతూ చౌదరీ పోస్ట్..
చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? కారణాలు ఇవే!
చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? కారణాలు ఇవే!
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన