Internet Data Tax: ఇంటర్నెట్ వాడే వారికి షాకింగ్ న్యూస్.. పెరగనున్న ధరలు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ చూడడం కష్టమేనా!
Internet Data Tax: భారత ప్రభుత్వం మొబైల్ డేటా వినియోగంపై ప్రత్యేక పన్ను విధించాలని యోచిస్తోంది. దీని వల్ల ఇంటర్నెట్ సేవలు మరింత ఖరీదవుతాయి. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది. టెలికాం రంగ సమీక్షా సమావేశంలో..

Internet Data Tax: ఇంటర్నెట్ వినియోగంపై పన్ను విధించడం గురించిన చర్చలు మరోసారి తీవ్రమయ్యాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక దేశాల ప్రభుత్వాలు డిజిటల్ సేవలపై పన్ను విధించాలని యోచిస్తున్నాయి. ఇంటర్నెట్ లేదా డిజిటల్ సేవలపై అదనపు పన్నులు విధిస్తే, అది వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌లు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. అంతేకాకుండా మొబైల్ డేటా, బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధరలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వాలు సాధారణ వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాయని, తరచుగా పన్నులను పెద్ద టెక్ కంపెనీలపైనే కేంద్రీకరిస్తాయని నిపుణులు అంటున్నారు. అందువల్ల మొత్తం మీద ఇంటర్నెట్ మరింత ఖరీదైనదిగా మారుతుందా లేదా అనేది ప్రభుత్వ తుది విధానాలు, నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
అయితే భారతదేశంలో మొబైల్ డేటా వినియోగంపై కొత్త పన్ను విధించే ప్రతిపాదనపై ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన టెలికాం రంగ సమీక్షా సమావేశంలో ఈ కీలక అంశం చర్చకు వచ్చింది. ఆర్థిక సంవత్సరం 2025లో దేశంలో దాదాపు 29 బిలియన్ జీబీ డేటా వినియోగం జరిగిందని డేటా గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ ప్రతి జీబీపై రూ.1 పన్ను విధించినట్లయితే ప్రభుత్వం దాదాపు రూ.న22,900 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 133 కిలోల బరువున్న మహిళ.. ఈ ట్రిక్స్‌తో 76 కిలోలు తగ్గింది.. ఎలా సాధ్యం?
ప్రస్తుతం మొబైల్ రీఛార్జిలపై 18% జీఎస్‌టీ అమలులో ఉంది. డేటా వినియోగంపై పన్ను విధిస్తే ఇది వినియోగదారులకు “రెట్టింపు దెబ్బ” అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పన్ను ప్రతిపాదన వెనుక రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి: ఒకటి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడం, మరొకటి యువత, పిల్లలలో పెరుగుతున్న స్క్రీన్ అడిక్షన్ సమస్యను నియంత్రించడం. అయితే, డేటా వినియోగంపై పన్ను విధించడం సాంకేతికంగా పెద్ద సవాలు అని, దీనిని అమలు చేయడం కష్టమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, స్టార్టప్‌లు కూడా దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT)కు సెప్టెంబర్ 30 నాటికి ఈ అంశంపై పూర్తి నివేదిక సమర్పించమని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ సమావేశంలో డేటా పన్ను ప్రతిపాదనతో పాటు టెలికాం రంగానికి సంబంధించిన ఇతర కీలక అంశాలపై కూడా చర్చించారు. వాటిలో ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) పునరుద్ధరణ ఒకటి. 78,000 మందికి స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) ఇచ్చిన తర్వాత కూడా బీఎస్ఎన్ఎల్‌లో ఇంకా 54,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ ఆదాయంలో దాదాపు 30% ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చు అవుతోందని, ఇది ప్రైవేట్ కంపెనీలతో (6-7%) పోలిస్తే చాలా ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. బీఎస్ఎన్ఎల్‌ను సమర్థవంతంగా మార్చడానికి, 4జీ, 5జీ సేవలను విస్తరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి: Gold Prioce: ఉగాది రోజు రికార్డు స్థాయిలో పతనం.. రూ.7 వేలకుపైగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..
సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కూడా ఈ సమావేశంలో చర్చించిన మరో ముఖ్యమైన అంశం. భారతదేశ ఇంటర్నెట్ డేటా ట్రాన్స్‌ఫర్‌లో 95% స్టేట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళ్లే సముద్రగర్భ కేబుల్స్ ద్వారా జరుగుతుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ సంఘర్షణల నేపథ్యంలో ఈ కేబుల్స్‌కు నష్టం జరిగితే భారతదేశ ఇంటర్నెట్ కనెక్టివిటీకి తీవ్ర అంతరాయం ఏర్పడవచ్చు. ఇంటర్నెట్ వేగం తగ్గడం, ఆర్థిక లావాదేవీలపై ప్రభావం వంటి తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. ప్రస్తుతం 101 సముద్రగర్భ కేబుల్ సిస్టమ్స్‌పై భారతదేశ ఇంటర్నెట్ ఆధారపడి ఉంది. ఈ వ్యవస్థల బలోపేతం, నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని సమావేశం నొక్కి చెప్పింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




