August 03, 2026
Subhash
ఫ్రీజర్‌లో అతిగా ఐస్ గడ్డకట్టడానికి గల ముఖ్య కారణాలు. వాటిని నివారించే ఎనిమిది చిట్కాలు వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఫ్రిడ్జ్ డోర్ రబ్బర్ సరిగ్గా మూసుకోకపోతే బయటి వేడి గాలి లోపలికి వెళ్లి తేమను పెంచి, ఐస్‌గా మారుస్తుంది. అందుకు ప్రతి సారి డోర్ వేసే ముందు జాగ్రత్తగా వేయడం ముఖ్యం.
ఫ్రిడ్జ్ డోర్‌ను ఎక్కువసేపు తెరిచి ఉంచడం వల్ల లోపలి వాతావరణం మారి మంచు ఎక్కువగా చేరుతుంది. తరచూగా తెరవడం మూయడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది.
ఫ్రిడ్జ్ టెంపరేచర్ చాలా తక్కువగా సెట్ చేస్తే, కూలింగ్ ఎక్కువ మంచు పెరిగిపోతుంది. అందుకే థర్మోస్టార్ సెట్టింగ్‌లో పొరపాటు ఉండవచ్చు. దాన్ని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
వేడిగా ఉన్న కూరలు లేదా పాలు నేరుగా ఫ్రిడ్జ్‌లో పెడితే వచ్చే ఆవిరి తేమగా మారి ఐస్‌గా రూపాంతరం చెందుతుంది. దీని వల్ల ఫ్రిజ్‌లో ఐస్ గడ్డలు ఏర్పడటం మొదలవుతుంది.
ఫ్రిజ్‌లో కరిగిన నీరు బయటకు వెళ్లే ప్రక్రియ మురికితో మూసుకుపోతే ఆ నీరు లోపల పేరుకుపోయి గడ్డకడుతుంది. ఇందుకు ఫ్రిజ్ నుంచి బయటకు వెళ్లే నీటి పైపును చెక్ చేసుకోండి.
ఫ్రిడ్జ్ నిండా వస్తువులను ఉంచినట్లయితే గాలి సరఫరా (Air Circulation) తగ్గి మంచు సమస్య పెరుగుతుంది. అందుకు పరిమితికిమంచి పదార్థాలను నిల్వ చేయడం ఉత్తమం.
ఆటో-డిఫ్రాస్ట్ ఫీచర్ పనిచేయకపోతే క్రమం తప్పకుండా మ్యాన్యువల్‌గా డిఫ్రాస్ట్ చేయడం లేదా టెక్నీషియన్‌తో బాగు చేయడం మేలు. డిఫ్రాస్ట్ సెన్సార్ లేదా టైమర్ సమస్య ఉండవచ్చని గుర్తించుకోండి.