AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ప్లాస్టిక్ కరెన్సీ వచ్చాక పేపర్ నోట్లు బ్యాన్..! కేంద్రం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. అసలు క్లారిటీ వచ్చేసింది..

ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై కేంద్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఆర్బీఐ త్వరలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. అయితే ఇవి అందుబాటులోకి వచ్చాక పేపర్ కరెన్సీ ఏమవుతుందనే ప్రశ్నలు చాలామందిలో వస్తున్నాయి. వీటిని రద్దు చేస్తారా అనే వార్తలు వస్తున్నాయి.

RBI: ప్లాస్టిక్ కరెన్సీ వచ్చాక పేపర్ నోట్లు బ్యాన్..! కేంద్రం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. అసలు క్లారిటీ వచ్చేసింది..
Rbi
Venkatrao Lella
|

Updated on: Aug 03, 2026 | 2:57 PM

Share

ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గతకొద్ది రోజుల క్రితం ఆర్బీఐ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో పాలిమర్‌తో కూడిన ప్లాస్టిక్ నోట్లను త్వరలో ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పాలిమర్ షీట్ల కోసం అంతర్జాతీయ కంపెనీల నుంచి ఆర్బీఐ టెండర్లను ఆహ్వానిస్తోంది. టెండర్లు ఖరారు అయిన తర్వాత ప్లాస్టిక్ నోట్ల ప్రింటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆర్బీఐ ఈ ప్రాజెక్టును చేపట్టగా.. ఏటీఎంలలో సాంకేతిక కారణాల వల్ల నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి పైలట్ ప్రాజెక్టుగా ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది ఆఖరు లేదా వచ్చే ఏడాదిలో వీటిని మనం చూడవచ్చు.

వచ్చే ఏడాది నుంచి చలామణిలోకి..

అయితే వచ్చే ఏడాది ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఆర్బీఐ చలామణిలోకి తీసుకురానుంది తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ వార్త ఆందోళన కల్గిస్తోంది. ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి తీసుకొచ్చాక ప్రస్తుతం అమల్లో ఉన్న పేపర్ కరెన్సీని ఆర్బీఐ నిలిపివేస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై కేంద్రం స్పష్టతిచ్చింది . ప్రస్తుతానికి పేపర్ కరెన్సీ నోట్లను నిలిపివేసే ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆర్ధికశాఖ సహాయమంత్రి దీని గురించి ప్రకటన చేశారు. ప్లాస్టిక్ కరెన్సీ అందుబాటులోకి వచ్చాక కూడా కాగితపు కరెన్సీ కూడా చలామణిలో కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ వద్ద ఉన్న పేపర్ కరెన్సీని మార్చుకోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. ఎప్పటిలాగే వాటిని ఉపయోగించకోవచ్చని, ప్రజలను ఇబ్బందులకు గురి చేసే నిర్ణయం తీసుకోబోమని పేర్కొన్నారు.

పైలట్ ప్రాజెక్టుగా..

ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను ఆర్బీఐ తొలుత తీసుకురానుంది. క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేపట్టిన అనంతరం మరిన్ని నోట్లను తీసుకొస్తారు. పైలట్ ప్రాజెక్ట్ కోసం పరిమితి స్థాయిలోనే మొదట్లో ఈ నోట్లను తయారుచేయనున్నారు. దేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితులు, వినియోగ పరిస్థితుల్లో వాటి తీరు గురించి పరీక్షిస్తారు. ఈ లక్ష్యంతోనే తొలుత ప్రయోగత్మకంగా రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను ఆర్బీఐ తీసుకురానుంది. ఒకసారి ప్రయోగం విజయవంతం అయిన తర్వాత భారీ స్థాయిలో వీటిని చలామణిలోకి తీసుకురానున్నట్లు కేంద్రం పేర్కింది. అయితే జులై 17వ తేదీన ఆర్బీఐకు చెందిన నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ముద్రించేందుకు 3.4 కోట్ల పాలిమర్ షీట్ల కోసం గ్లోబల్ టెండర్ ఆహ్వానించింది. ఈ టెండర్‌లో తక్షణ అవసరం అని పేర్కొంది. పరీక్షలు విజయంతం అయిన తర్వాత వివిధ డినామినేషన్ల కోసం పెద్ద పరిమాణంలో సబ్‌స్ట్రేట్ సేకరిస్తారు.

Follow Us