AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి.. నూనె లేకుండా ఆవిరిపై ఉడికే అమృతం!

పూర్వకాలంలో మన పెద్దలు నూనె చుక్క కూడా లేకుండా, కేవలం ఆవిరిపై పౌష్టికమైన అల్పాహారాలను తయారు చేసుకుని ఎంతో దృఢంగా జీవించేవారు. అలాంటి పురాతన సంప్రదాయ వంటకాల్లో గోదావరి జిల్లాల ప్రత్యేకమైన 'వాసెన పోళి' ఒకటి. ఈ సంప్రదాయ వాసెన పోళి రుచి, ఆరోగ్య ప్రయోజనాలను భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు సైతం ఎంతో ప్రశంసించారు.

Phani CH
|

Updated on: Aug 23, 2026 | 9:40 PM

Share
సాధారణంగా బియ్యంతో చేసే ఈ వంటకాన్ని వివిధ రకాల మిల్లెట్స్, మినప్పప్పుతో కలిపి చేస్తే డయాబెటిస్, బీపీ ఉన్నవారికి మరియు బరువు తగ్గాలనుకునే వారికి అమృతంలా పనిచేస్తుంది. ఆ అద్భుతమైన రెసిపీ వివరాలు ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు:  ఒక గ్లాసు పొట్టు మినప్పప్పు, సిరిధాన్యాల రవ్వ-కొర్రలు, అరికెలు, సామలు లేదా రాగి రవ్వ - రెండు గ్లాసులు, పావు కప్పు నానబెట్టిన అటుకులు లేదా అన్నం, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు మరియు ఆవిరిపై ఉడికించడానికి తాజా విస్తరాకులు లేదా ఇడ్లీ పాత్ర.

1 / 5
పిండి తయారీ విధానం: ముందుగా ఒక గ్లాసు పొట్టు మినప్పప్పును శుభ్రంగా కడిగి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మనకు నచ్చిన సిరిధాన్యాల రవ్వను (మిల్లెట్ రవ్వ) కూడా రెండు గ్లాసులు తీసుకుని నీటిలో నానబెట్టాలి. మినప్పప్పుతో పాటు కొద్దిగా అటుకులు నానబెడితే పిండి బాగా పొంగి పోళి ఎంతో మృదువుగా వస్తుంది.

2 / 5
నానిన మినప్పప్పును గ్రైండర్‌లో లేదా మిక్సీలో తగినన్ని చల్లని నీళ్లు పోస్తూ గారెల పిండిలా మెత్తగా, ప్లఫ్ఫీగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన సిరిధాన్యాల రవ్వలోని నీరంతా పిండేసి ఈ మినప రుబ్బులో వేసి బాగా కలపాలి. ఈ పిండి మిశ్రమాన్ని కనీసం 8 గంటలు పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పొంగుతుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఉండలు లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి.

3 / 5
వాసెన పోళి ఉడికించే విధానం: సంప్రదాయ పద్ధతిలో విస్తరాకులను గ్లాసు లేదా గిన్నె ఆకారంలో అమర్చి టూత్‌పిక్‌తో సెట్ చేయాలి. అందులో సిద్ధం చేసుకున్న మిల్లెట్ పిండిని ముప్పావు వంతు వరకు నింపాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో లేదా వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. ఆవిరి వస్తున్నప్పుడు విస్తరాకుల్లో నింపిన పిండి కప్పులను పెట్టి మూతపెట్టాలి. మీడియం మంటపై 10 నుండి 12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. విస్తరాకులు అందుబాటులో లేనివారు సాధారణ ఇడ్లీ ప్లేట్లలో లేదా గిన్నెలలో కూడా నేరుగా ఆవిరిపై ఉడికించుకోవచ్చు.

4 / 5
ఉడికిన తర్వాత తీసి కాస్త చల్లారనిచ్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే సంప్రదాయ వాసెన పోళి సిద్ధం! ఎలాంటి నూనె వాడకుండా ఆవిరిపై ఉడికిన ఈ మెత్తని పోళిని పల్లీల చట్నీ, కొబ్బరి పచ్చడి లేదా కారప్పొడి, నెయ్యితో తింటే అద్భుతమైన రుచితో పాటు రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది.

5 / 5
Follow Us