AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న

గుడ్డును పగలగొట్టకుండా అందులోని కోడిపిల్లను బయటకు తీయాలని అక్బర్‌ చక్రవర్తి బీర్బల్‌కు చిక్కుప్రశ్న వేశారు. బీర్బల్‌ మాత్రం తొందరపడకుండా సమస్యను అర్థం చేసుకుని తెలివైన సమాధానం ఇచ్చాడు. ఈ కథలో బీర్భల్ సమాధానం ఓ గొప్ప విషయం తెలియజేస్తుంది. మనకు ప్రతి ఫలితానికి సరైన సమయం ఉంటుందని, కృషితో పాటు ఓపిక కూడా అవసరమని చాటి చెబుతుంది..

గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
Remove The Chick Without Breaking The Egg
Srilakshmi C
|

Updated on: Oct 05, 2026 | 7:14 AM

Share

అక్బర్‌ చక్రవర్తి, బీర్బల్‌ మధ్య జరిగే తెలివైన సంభాషణలు, సవాళ్లు ఇప్పటికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన కథే ఇది. గుడ్డును పగలగొట్టకుండా అందులోని కోడిపిల్లను బయటకు తీయాలి అంటూ అక్బర్‌ చక్రవర్తి బీర్బల్‌కు ఓ సవాలు విసిరారు. అందుకు బీర్బల్‌ ఇచ్చిన సమాధానం అందరికీ ఓ మంచి జీవిత పాఠాన్ని నేర్పింది.

ఓ రోజు అక్బర్‌ రాజసభలోకి వచ్చి బీర్బల్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత బీర్బల్‌ సభకు చేరుకున్నాడు. వెంటనే అక్బర్‌ ఓ సేవకుడిని పిలిచి, వెండి పళ్లెంలో ఉన్న తెల్లని గుడ్డును బీర్బల్‌ చేతికి ఇచ్చారు. ‘గుడ్డులో ఉన్న కోడిపిల్లను బయటకు తీసి చూపించాలి. అయితే గుడ్డు మాత్రం పగలకూడదు’ అని అక్బర్‌ షరతు పెట్టారు. ఈ సవాలు విన్న సభికులు ఆశ్చర్యపోయారు. గుడ్డు పగలకుండా అందులోని పిల్లను బయటకు తీయడం ఎలా సాధ్యమని ఆలోచించారు. బీర్బల్‌ మాత్రం ప్రశాంతంగా ఆలోచిస్తూ, తనకు సాయంత్రం వరకు సమయం కావాలని కోరాడు.

బీర్బల్‌ గుడ్డును జాగ్రత్తగా పరిశీలించాడు. ఎక్కడైనా పగులు ఉన్నాయేమో చూశాడు. కానీ గుడ్డు పూర్తిగా సరిగ్గానే ఉంది. దీంతో అతను రాజభవనం వెనుక భాగంలో కోళ్లను చూసుకునే రఘు అనే వృద్ధుడి వద్దకు వెళ్లాడు. ‘గుడ్డులో ఉన్న పిల్ల ఎప్పుడు బయటకు వస్తుంది?’ అని బీర్బల్‌ అడిగాడు. అందుకు రఘు, సరైన సమయం వచ్చినప్పుడు పిల్లే గుడ్డును పగలగొట్టుకుని బయటకు వస్తుందని చెప్పాడు. దానికి సరైన వెచ్చదనం, సురక్షితమైన ప్రదేశం, తగిన సమయం అవసరమని వివరించాడు. అంతే.. బీర్బల్‌కు అక్బర్‌ సవాలుకు సమాధానం దొరికింది.

ఇవి కూడా చదవండి

సాయంత్రం అక్బర్‌ బీర్బల్‌ను పిలిచి సమాధానం చెప్పమన్నారు. అప్పుడు బీర్బల్‌ తన తెలివైన సమాధానాన్ని చెప్పాడు. ‘మహారాజా.. మీరు గుడ్డు పగలకూడదని చెప్పారు. పిల్ల వెంటనే బయటకు రావాలని మాత్రం చెప్పలేదు. కాబట్టి నేను గుడ్డును పగలగొట్టను. పిల్లను బలవంతంగా బయటకు తీయను. దానికి కావాల్సిన సరైన వాతావరణాన్ని కల్పిస్తాను. సరైన సమయం వచ్చినప్పుడు పిల్లే బయటకు వస్తుంది’ అని చెప్పాడు. బీర్బల్‌ సమాధానం విన్న అక్బర్‌ ఆశ్చర్యపోయారు. చివరకు బీర్బల్‌ సవాలును విజయవంతంగా పరిష్కరించాడని ప్రకటించారు.

ఈ కథ చెప్పే జీవిత పాఠం

ఈ కథలోని అసలు సందేశం ‘ప్రతి ఫలితానికి ఒక సరైన సమయం ఉంటుంది’ అనేదే. మనం ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు వెంటనే ఫలితం రావాలని కోరుకుంటాం. కానీ కొన్ని విషయాలను తొందరపెట్టి సాధించలేం. విత్తనం వేసిన వెంటనే పంట రాదు. విద్యార్థి ఒక్కరోజులో చదివి మంచి ఫలితాలు సాధించలేడు. వ్యాపారంలో కూడా ప్రతి నిర్ణయానికి తగిన సమయం, ఆలోచన అవసరం. సంబంధాల్లోనూ కొన్నిసార్లు ఎదుటివారికి మన మాట అర్థం చేసుకునేందుకు సమయం ఇవ్వాలి. అందుకే మనం చేయాల్సిన ప్రయత్నం చేయాలి. ఫలితం రావడానికి అవసరమైన సరైన పరిస్థితులను సృష్టించాలి. ఆ తర్వాత ఓపికగా సరైన సమయం కోసం ఎదురుచూడాలి.

గుడ్డులోని పిల్ల తన సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చినట్టే.. జీవితంలో మన కృషికి తగిన ఫలితం కూడా సరైన సమయంలోనే వస్తుంది. తొందరపడి మంచి అవకాశాన్ని పాడుచేసుకోవడం కంటే, ఓపికగా ఎదురుచూడటం ఎంతో మంచిది.

Follow Us
గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
'వారణాసి'లో మరో స్టార్ హీరోయిన్.. ఆ అందాల భామతో మహేష్ రొమాన్స్
'వారణాసి'లో మరో స్టార్ హీరోయిన్.. ఆ అందాల భామతో మహేష్ రొమాన్స్
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..! బార్లు, రెస్టారెంట్లు బంద్..
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..! బార్లు, రెస్టారెంట్లు బంద్..
ఎల్పీజీ సిలిండర్లు వాడేవారికి కొత్త రూల్స్.. ఈ నెల నుంచే..
ఎల్పీజీ సిలిండర్లు వాడేవారికి కొత్త రూల్స్.. ఈ నెల నుంచే..
సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ..
సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ..
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?