AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. రేపట్నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు 2026 ప్రారంభం

APPSC గ్రూప్-1 ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6, 2026 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 13 కీలక సర్వీసుల్లో పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 27 వరకు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే OTPR నమోదు పూర్తి చేసుకోవాలని కమిషన్ సూచించింది..

APPSC గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. రేపట్నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు  2026 ప్రారంభం
APPSC Group 1 Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 05, 2026 | 8:08 AM

Share

అమరావతి, అక్టోబర్ 5: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ రేపట్నుంచి ప్రారంభం కానుంది. 2026 అక్టోబర్‌ 6 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 27, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్‌-1 నియామకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని పలు కీలక సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, డిస్ట్రిక్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DEO), డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 13 రకాల సర్వీసులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.

గ్రూప్‌ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 6న ప్రారంభమై అక్టోబర్‌ 27న ముగుస్తుంది. దరఖాస్తు ప్రక్రియలో చివరి నిమిషంలో సర్వర్‌ సమస్యలు లేదా సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు ముందుగానే వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (OTPR) పూర్తి చేసుకోవాలని APPSC సూచించింది. OTPR పూర్తయిన తర్వాత దరఖాస్తు ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రూప్‌-1 వంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు దరఖాస్తు తేదీలను గమనించి, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

అధిక గ్రూప్‌ 1 పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పోస్టును బట్టి ప్రత్యేక విద్యార్హతలు ఉండే అవకాశం ఉంది. డీఎస్పీ (కమ్యూనికేషన్స్‌) పోస్టులకు మాత్రం ఈసీఈ (ECE), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ లేదా రేడియో ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. గ్రూప్ 1 ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని పలు కీలక విభాగాల్లో ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, డీఈఓ, డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ద్వారా భర్తీ చేసే సర్వీసులు ఇవే..

  • డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సంఖ్య: 11
  • ట్యాక్స్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ కమిషనర్ పోస్టుల సంఖ్య: 14
  • డీఎస్పీ సివిల్‌ పోస్టుల సంఖ్య: 36
  • డీఎస్పీ కమ్యూనికేషన్స్‌ పోస్టుల సంఖ్య: 3
  • డీఈవో పోస్టుల సంఖ్య: 14
  • ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 1
  • ఆర్టీవో పోస్టుల సంఖ్య: 3
  • డిప్యూటీ రిజిస్టర్‌ కోఆపరేటివ్‌ సర్వీసెస్‌ పోస్టుల సంఖ్య: 15
  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 పోస్టుల సంఖ్య: 12
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 2
  • డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 3
  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 14
  • డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 35

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
APPSC గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. రేపట్నుంచే దరఖాస్తులు
APPSC గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. రేపట్నుంచే దరఖాస్తులు
ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీపై ఆర్బీఐ కీలక ప్రకటన.. త్వరలో రాబోయే ఇవే
ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీపై ఆర్బీఐ కీలక ప్రకటన.. త్వరలో రాబోయే ఇవే
ఈ సినిమాను తెగ చూస్తున్న జెన్ జీ కుర్రాళ్లు..
ఈ సినిమాను తెగ చూస్తున్న జెన్ జీ కుర్రాళ్లు..
ఉదయాన్నే కాఫీ, టీ, టిఫిన్ వద్దు.. ఇది ఒక్క గ్లాస్ తాగండి..
ఉదయాన్నే కాఫీ, టీ, టిఫిన్ వద్దు.. ఇది ఒక్క గ్లాస్ తాగండి..
కరెన్సీ నోట్లపై ఉండే గాంధీ ఫొటో రియల్‌దేనా..? అసలు నిజం..
కరెన్సీ నోట్లపై ఉండే గాంధీ ఫొటో రియల్‌దేనా..? అసలు నిజం..
భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న యంగ్ టీమిండియా!
భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న యంగ్ టీమిండియా!
గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
'వారణాసి'లో మరో స్టార్ హీరోయిన్.. ఆ అందాల భామతో మహేష్ రొమాన్స్
'వారణాసి'లో మరో స్టార్ హీరోయిన్.. ఆ అందాల భామతో మహేష్ రొమాన్స్
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్