AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక కిలో బరువు తగ్గాలంటే ఎన్ని అడుగులు నడవాలి..? ఈ లెక్కలు తెలిస్తే..

రూపాయి ఖర్చు లేకుండా శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాని అత్యుత్తమ వ్యాయామం వాకింగ్. బరువు తగ్గడానికి ఖరీదైన జిమ్‌లకు వెళ్లక్కర్లేదు.. గంటల తరబడి డైటింగ్ చేయక్కర్లేదు, రోజూ కాసేపు నడిస్తే చాలు అంటుంటారు. అయితే అసలు ఒక కిలో బరువు తగ్గాలంటే ఎన్ని వేల అడుగులు నడవాలో తెలుసా? ఈ షాకింగ్ లెక్కలు తెలిస్తే రోజూ గుడ్డిగా వాకింగ్ చేసే పద్ధతిని వెంటనే మార్చుకుంటారు. నడకతో వేగంగా, ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సైన్స్ చెబుతున్న ఆ మ్యాజిక్ ఫార్ములా ఇదే..

Krishna S
|

Updated on: Oct 04, 2026 | 9:52 PM

Share
1 కిలో తగ్గాలంటే ఎంత శ్రమ?: సాధారణంగా నడిచే వేగం, శరీర బరువును బట్టి గంటకు సగటున 200 నుంచి 400 కేలరీలు ఖర్చవుతాయి. శరీర ధర్మ శాస్త్ర లెక్కల ప్రకారం.. శరీరంలో దాదాపు 7,700 కేలరీలను ఖర్చు చేస్తేనే 1 కిలో బరువు తగ్గుతారు. ఒకవేళ ఎవరైనా కేవలం వారం రోజుల్లోనే 1 కిలో తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంటే, ప్రతిరోజూ దాదాపు 1,100 కేలరీలు బర్న్ చేయాల్సి ఉంటుంది. అయితే సాధారణ జీవనశైలిలో కేవలం వ్యాయామం ద్వారానే అంత పెద్ద మొత్తంలో కేలరీలను తగ్గించడం చాలా పెద్ద సవాలుతో కూడుకున్న పని.

1 / 5
రోజుకు 25 వేల అడుగులు సాధ్యమేనా?: మనం నడిచే ప్రతి 1,000 అడుగులకు సగటున 40 నుండి 50 కేలరీలు మాత్రమే ఖర్చవుతాయి. ఈ లెక్కన రోజుకు 1,100 కేలరీలు కరిగించాలంటే.. ఒక వ్యక్తి రోజుకు ఏకంగా 22,000 నుంచి 27,000 అడుగులు నడవాల్సి వస్తుంది. రోజువారీ బిజీ లైఫ్‌లో సాధారణ ఉద్యోగులకు, మహిళలకు రోజూ 25 వేల అడుగులు నడవడం దాదాపు అసాధ్యం. అంతగా నడిస్తే బరువు తగ్గడం పక్కన పెడితే తీవ్రమైన కండరాల నొప్పులు, మోకాళ్ల సమస్యలు, అధిక అలసట వచ్చి శరీరం పూర్తిగా నీరసించిపోయే ప్రమాదం ఉంది.

2 / 5
డైట్ - వాకింగ్ కాంబినేషన్: ఈ సమస్యకు నిపుణులు ఒక అద్భుతమైన సమతుల్య పరిష్కారాన్ని సూచిస్తున్నారు. కేవలం నడక మీదే భారం వేయకుండా.. రోజువారీ తీసుకునే ఆహారంలో 500 కేలరీలను తగ్గించుకోవాలి. స్వీట్లు, జంక్ ఫుడ్, నూనె పదార్థాలను నియంత్రిస్తే ఈ 500 కేలరీల లోటు సులువుగా ఏర్పడుతుంది. ఆ సమయంలో రోజుకు 12,000 నుంచి 15,000 అడుగులు నడిస్తే సరిపోతుంది. వారంలోనే 1 కిలో తగ్గడం కంటే.. 10 నుండి 15 రోజుల వ్యవధిలో 1 కిలో చొప్పున క్రమంగా తగ్గడమే శరీర ఆరోగ్యానికి అత్యంత సురక్షితమైన పద్ధతి.

3 / 5
వేగంగా ఫలితాలు రావాలంటే: నడక ద్వారా సరైన ఫలితాలు రావాలంటే నడిచే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మామూలుగా కాకుండా చేతులు ఊపుతూ వేగంగా నడవాలి, వీలైతే కాస్త ఎత్తుగా లేదా ఏటవాలుగా ఉన్న దారుల్లో నడిస్తే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ప్రారంభంలోనే ఒకేసారి 10 వేల అడుగులు నడవడానికి ప్రయత్నించకుండా క్రమంగా సంఖ్యను పెంచుకోవాలి. ప్రతి వారం మీ రోజువారీ అడుగులను 10 శాతం మాత్రమే పెంచుతూ వెళ్లడం వల్ల శరీరానికి అధిక శ్రమ కలగకుండా సులువుగా అలవాటు పడుతుంది.

4 / 5
విశ్రాంతి, నిద్ర - హైడ్రేషన్ ప్రాముఖ్యత:  నడకతో పాటు శరీరానికి సరైన విశ్రాంతిని అందించడం అంతే ముఖ్యం. కండరాలు కోలుకోవడానికి వారంలో కనీసం ఒక రోజు వ్యాయామం నుంచి పూర్తి విరామం తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం, నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలో జీవక్రియ మందగించి బరువు తగ్గడం ఆగిపోతుంది. ఇక ఎక్కువ సమయం నడవడానికి ముందు, నడుస్తున్నప్పుడు, ఆ తర్వాత శరీరానికి సరిపడా మంచినీరు తాగుతూ డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవడం అత్యంత కీలకం.

5 / 5
Follow Us