కొబ్బరి త్వరగా పాడైపోతుందా.. ఇలా స్టోర్ చేయండి నెలైనా..

28 November 2026

Anand T

కొబ్బరి.. దీన్ని వంటల్లో మాత్రమే కాదు, అనేక రకాల స్వీట్ల తయారీలో కూడా విరివిగా వాడుతారు.

కొబ్బరి స్టోరేజ్

ముఖ్యంగా సౌతిండియా వంటగదుల్లో ఈ కొబ్బరికి ఉన్న ప్రత్యేకతే వేరు.. చాలా వంటకాల్లో ఇది కచ్చితంగా ఉండాల్సిందే.

కొబ్బరి స్టోరేజ్

అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత దాని నుంచి తీసిన పచ్చి కొబ్బరి సాధారణ వాతావరణంలో చాలా త్వరగా పాడైపోతుంది.

కొబ్బరి స్టోరేజ్

కానీ దాన్ని సరైన పద్ధతిలో స్టోర్ చేస్తే దాదాపు నెల రోజుల వరకు ఏమాత్రం చెడిపోకుండా ఫ్రెష్‌గా ఉంచవచ్చు.

కొబ్బరి స్టోరేజ్

పచ్చి కొబ్బరి ముక్కలు లేదా తురుము వారం రోజుల పాటు తాజాగా ఉండాలంటే గాలి చొరబడని డబ్బాలో వేసి సాధారణ ఫ్రిజ్‌లో పెట్టాలి.

కొబ్బరి స్టోరేజ్

అదే కొబ్బరి నెల రోజుల వరకు ఫ్రెష్‌గా ఉండాలంటే మాత్రం దాన్ని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసి డీప్ ఫ్రీజర్‌లో నిల్వ చేయాలి.

కొబ్బరి స్టోరేజ్

లేదా పచ్చి కొబ్బరిని జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి, లోపల గాలి లేకుండా తీసేసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టినా నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది.

కొబ్బరి స్టోరేజ్

ఫ్రీజర్‌లో పెట్టిన కొబ్బరిని వంటకు వాడుకునే 15 నిమిషాల ముందు బయట పెడితే మళ్లీ అప్పుడే కొట్టిన కొబ్బరిలా మారుతుంది.

కొబ్బరి స్టోరేజ్

ఇక పగలగొట్టని పూర్తి టెంకాయను ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే ఫ్రిజ్‌లో కాకుండా, చల్లని ప్రదేశంలో గది ఉష్ణోగ్రత వద్దనే ఉంచండి.

కొబ్బరి స్టోరేజ్