AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై సింపుల్.. ఆన్‌లైన్‌లోనే టెస్ట్ రాయొచ్చు.. ప్రభుత్వ ఆఫీసులకు అక్కర్లేదు..

ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేశారు. ఇకపై డిజిటల్ విధానాన్ని పాటించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఎల్ఎల్ ప్రక్రియను ఆన్‌లైన్ చేసింది. ఆన్ లైన్ ద్వారానే ఎల్‌ఎల్ఆర్ పరీక్షకు హాజరుకావొచ్చు. రవాణశాఖ కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేదు.

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై సింపుల్.. ఆన్‌లైన్‌లోనే టెస్ట్ రాయొచ్చు.. ప్రభుత్వ ఆఫీసులకు అక్కర్లేదు..
Driving License Andhra Prad
Venkatrao Lella
|

Updated on: Oct 05, 2026 | 8:29 AM

Share

డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా Learner Licence (LLR) పొందాల్సి ఉంది. ఇందుకోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం రవాణశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది. ఇందుకోసం సమయం వృథా అయ్యేది. ఇక దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించి వేలకు వేలు డబ్బులు కూడా వెచ్చిస్తున్నారు కొంతమంది వాహనదారులు. అయితే ఇక నుంచి అలాంటి అవసరం లేదు. మీ ఇంట్లోనే ఉండి ఎల్ఆర్ఆర్ పరీక్ష రాయొచ్చు. ఈ మేరకు ఆన్‌లైన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆన్‌లైన్ ద్వారా LLR పరీక్ష రాయడం ఎలా..?

ఎల్‌ఆర్ఆర్ టెస్ట్ రాయడానికి ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కలిగి ఉండాలి. అందులో కెమెరా కలిగి ఉండాలి. ఆధార్, ఈకేవైసీ వంటి ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత టెస్ట్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష రాసేటప్పుడు మీ లైవ్ వీడియో రికార్డ్ అవుతుంది. పరీక్ష పూర్తయిన తర్వాత మీరు అర్హత సాధించారా.. లేదా అనేది వెంటనే తెలుస్తుంది. ఇప్పటివరకు రవాణశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్ లైన్ విధానం వల్ల సమయం, డబ్బులు ఆదా కానున్నాయి. ఎల్ఎల్ఎల్ పరీక్ష రాయలంటే ముందుగా ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇక స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి. ఆధార్ కేవైసీ పూర్తి చేయనివారు రవాణశాఖ కార్యాలయానికి వెళ్లి హాజరుకావాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

ముందుగా సారథి పోర్టల్‌లోకి వెళ్లి మీ రాష్ట్రాన్ని ఎంచుకుని ఎల్ఎల్ఆర్ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. ఆధార్, ఇతర వివరాలను నమోదు చేసి దరఖాస్తు సమర్పించాలి. ఆ తర్వాత ఎల్ఎల్‌ఎల్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే ఫీజును చెల్లిస్తే అప్లికేషన్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ల్యాప్‌టాప్ లేదా డెస్క్ టాప్‌లో అప్లికేషన్ పూర్తి చేసి అప్లికేషన్ ఓపెన్ చేయాలి. మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ, ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ చేయాలి. అనంతరం పరీక్షలో 20 ప్రశ్నలు ఉంటాయి. కనీసం 12 ప్రశ్నలకు కరెక్ట్ సమాధానాలు ఇస్తే అర్హత సాధిస్తారు. పరీక్షలు వేరే వ్యక్తి రాయకుండా, అక్రమాలు చోటుచేసుకోకుండా Safe Exam Browser, AI ఆధారిత Exam Proctoring వంటి ఫీచర్లను ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఒక కంప్యూటర్ ఐపీ అడ్రస్ ద్వారా ఒక రోజులో పరిమిత సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలు రాసేలా విధారం రూపొందించారు.

Follow Us