Weather Report: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Southwest Monsoon Withdraws: మాన్‌సూన్ సీజన్ ముగిసింది. ఇక వర్షాలు కూడా రావని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోంది. అంటే భారత్ నుంచి నైరుతి రుపువణాలు వెనుతిరుగుతున్నాయి. దీంతో తెలుగురాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో తేటిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. కాబట్టి ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. నైరుతి రుపతవనాల తిరోగమనం ఎఫెక్ట్‌తో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత మే నెలలో కేళలోని కొచ్చి తీరాన్ని తానిక నైరుతి రుతుపవనాలు, జూన్ ఫస్ట్ వీక్‌లో తెలంగాణ, జులై ఫస్ట్ నాటికి తెలంగాణ మొత్తం వ్యాప్తించాయి. ఇక ఇలా వచ్చిన రుతువణాలు నవంబర్‌లో తిరుగు ప్రయాణం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణను తాకాయి. రాబోయే 24 గంటల్లో ఈ రుపువణాలు పూర్తి తెలంగాణ నుంచి నిష్క్రమించనున్నాయని వాతావరణ శాఖ అంచానా వేసింది.
దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలోని నల్గొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ రూరల్, యాదాద్రి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా. మరి కొన్ని ప్రాంతాల్లో పోడి వాతావరణ కూడా ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీతో సోమవారం వాతావరణం
ఇక ఏపీలోనూ తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ అంతర్గత కర్ణాటక, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కేరళ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం, పై ద్రోణితో విలీనమైందని.. అలాగే దక్షిణ కోస్తా, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడి.. యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయిని.. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
