AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇటువంటి వారికి మొక్కజొన్న యమ డేంజర్.. తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

వేడివేడి బొగ్గులపై కాల్చి, నిమ్మరసం, కారం అద్దిన మొక్కజొన్న పొత్తును తింటుంటే ఆ మజాయే వేరు. రుచితో పాటు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించే ఈ మొక్కజొన్నను అందరూ అమితంగా ఇష్టపడతారు. అయితే ఇది అందరి ఆరోగ్యానికీ మంచిది కాదని మీకు తెలుసా? కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు దీనిని తింటే లేనిపోని చిక్కులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Aug 24, 2026 | 7:50 AM

Share
మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్ బి1, బి6, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, రిబోఫ్లేవిన్ వంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. అంతేకాకుండా ఇందులో సమృద్ధిగా లభించే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, ఇందులోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరును క్రమబద్ధీకరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.

1 / 5
మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంత మంచిదైనప్పటికీ, ఇది అందరి శరీర తత్వాలకు సరిపడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని మెడికవర్ హాస్పిటల్ సీనియర్ డైటీషియన్ స్వాతి వెల్లడించిన వివరాల ప్రకారం.. కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మొక్కజొన్నను అధికంగా తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ముప్పు ఉంటుంది.

2 / 5
ముఖ్యంగా తరచూ చర్మ సమస్యలు, దద్దుర్లు, అలర్జీలతో బాధపడేవారు మొక్కజొన్నను దూరం పెట్టడం లేదా మితంగా తీసుకోవడం మంచిది. ఇందులోని కొన్ని ప్రొటీన్లు చర్మ ప్రతిచర్యలను పెంచి సమస్యను తీవ్రతరం చేస్తాయి. అలాగే ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల షుగర్ ఉన్నవారు ఒకేసారి ఎక్కువ పరిమాణంలో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.

3 / 5
జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ ఉన్నవారు దీనిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం పెరుగుతాయి. మరోవైపు బరువు తగ్గాలనుకునేవారు నూనె, వెన్న, అధిక ఉప్పు లేకుండా ఉడకబెట్టిన రూపంలో మాత్రమే తీసుకోవాలి. పచ్చిగా లేదా సగం ఉడికిన మొక్కజొన్నను ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదని, ఇది కడుపునొప్పి, ప్రేగుల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని డైటీషియన్ స్వాతి హెచ్చరిస్తున్నారు.

4 / 5
మొక్కజొన్నను ఎంచుకునేటప్పుడు, కాల్చేటప్పుడు కూడా సరైన జాగ్రత్తలు పాటించాలి. శుభ్రమైన వాతావరణంలో తయారుచేసిన వాటినే ఎంచుకోవాలి. మొక్కజొన్నను బొగ్గులపై లేత బంగారు గోధుమ రంగు వచ్చేవరకే వేయించాలి. మరీ నల్లగా మాడేలా కాల్చిన భాగాల్లో శరీరానికి హానిచేసే పదార్థాలు ఉత్పన్నమవుతాయని, అలాంటివి ఎక్కువగా తింటే దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

5 / 5
Follow Us
డీమార్ట్‌లో తెలివిగా షాపింగ్ చేయడం ఎలా..? ఈ చిట్కాలు పాటిస్తే..

పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కొత్తగా మరో 3లక్షల ఇళ్లు

కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు

మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్

చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..

దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో

తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్

చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?

చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..

ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..