AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం.. రుచి చూస్తే పరవశించిపోతారు!

మన తెలుగు సంస్కృతిలో పాతకాలపు వంటకాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే కాలక్రమేణా ఎన్నో అద్భుతమైన సాంప్రదాయ వంటకాలు కనుమరుగైపోతున్నాయి. అలాంటి వాటిలో సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ప్రాచీన తీపి వంటకం 'సుఖీయం' ఒకటి. విజయనగర సామ్రాజ్య కాలంలో ఆలయాల్లో దివ్య నైవేద్యంగా, వివాహాది శుభకార్యాల్లో రాచరికపు తీపిగా దీనిని సమర్పించేవారట.

Phani CH
|

Updated on: Aug 23, 2026 | 8:44 PM

Share
చూడటానికి బూరెల మాదిరిగా అనిపించినా, దీని లోపల ఉండే పెసలు, బెల్లం, పచ్చి కొబ్బరి పూర్ణం అమృతతుల్యమైన రుచినిస్తుంది. ఈ విశిష్టమైన వంటకం తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఆకుపచ్చని ముడి పెసలు, ఒకటిన్నర కప్పు తురిమిన బెల్లం, అర కప్పు తాజా పచ్చి కొబ్బరి తురుము, పావు టీస్పూన్ యాలకుల పొడి, ఒక కప్పు గోధుమపిండి, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు ఉప్పు,  రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి మరియు వేయించడానికి సరిపడా నూనె.

1 / 5
పూర్ణం తయారీ విధానం: ముందుగా ఒక కప్పు పెసలను శుభ్రంగా కడిగి 7 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన పెసలను కుక్కర్‌లో వేసి రెండు కప్పుల నీళ్లు పోసి మీడియం మంటపై మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పెసలు మరీ పేస్ట్‌లా కాకుండా మృదువుగా ఉడికిన తర్వాత నీటిని వడకట్టి చల్లారనివ్వాలి.

2 / 5
స్టవ్ మీద కడాయి పెట్టి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగి పాకం కాస్త జిడ్డుగా మారినప్పుడు ఉడికించిన పెసలు, అర కప్పు పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. మీడియం మంటపై నిదానంగా కలుపుతూ మిశ్రమం దగ్గరపడే వరకు ఉడికించాలి. చివరగా ఒక చెంచా నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆపేయాలి. ఈ పెసల పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలు చుట్టడానికి వీలుగా బిగుసుకుంటుంది. అప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా ఉండలు చేసుకోవాలి.

3 / 5
బాటర్ & వేయించే విధానం: ఒక గిన్నెలో కప్పు గోధుమపిండి, చిటికెడు ఉప్పు, పసుపు, ఒక స్పూన్ నెయ్యి వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బజ్జీల పిండిలా చిక్కగా కలుపుకుని ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి. స్టవ్ మీద బాండీలో నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత పూర్ణం ఉండలను ఒక్కొక్కటిగా గోధుమపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి.

4 / 5
మీడియం మంటపై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే చారిత్రక తీపి వంటకం సుఖీయం సిద్ధం! పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ కమ్మని స్వీట్ తింటుంటే రాచరికపు రుచి అనుభూతి కలుగుతుంది.

5 / 5
Follow Us
దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకైన 5 బైక్‌లు ఇవే!

Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు

'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి

'అమ్మాయిగా మారి పదేళ్లు'.. బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్

అరటి పండు, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే జరిగేది ఇదే!

నీరు తక్కువగా తాగితే మీ గుండెకు ప్రమాదమా? 

స్వాతంత్య్ర వేడుకల్లో ఏనుగు మాంసం.. 23 ఏనుగుల వధపై విమర్శలు

ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారా..? ఈ ట్రిక్స్‌తో..

ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో సూరి- సుహాస్‌ల 150 కోట్ల బ్లాక్ బస్టర్