AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాంసంగ్ గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ 5జీ.. ఫీచర్లు, ధర తెలిస్తే ఎప్పుడెప్పుడు కొనేయాలా అనుకుంటారు

Samsung Galaxy S26 FE 5G.. శాంసంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. శాంసంగ్ గెలాక్సీ S26 FE 5G పేరుతో రానున్న ఈ ఫోన్ ఆగస్టు 27న అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ గురించిన విశేషాలు తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ 5జీ.. ఫీచర్లు, ధర తెలిస్తే ఎప్పుడెప్పుడు కొనేయాలా అనుకుంటారు
Samsung Galaxy S26 Fe 5g
Nikhil
|

Updated on: Aug 24, 2026 | 7:50 AM

Share

శాంసంగ్ ఆగస్టు 27, 2026న కొత్త గెలాక్సీ ఎస్26 సిరీస్ మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్ వర్చువల్‌గా జరగనుండగా, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. భారత్‌లో ఈ లాంచ్ ఈవెంట్ ఆగస్టు 27న సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. అద్భుతమైన ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తున్న ఈ కొత్త ఎఫ్‌ఈ మోడల్ యొక్క అంచనా స్పెసిఫికేషన్లు, పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ప్రాసెసర్ విశేషాలు

. ఇది కేవలం భారత్ కోసం నిర్వహించే ఈవెంట్ కానప్పటికీ, ఈ లాంచ్ గెలాక్సీ S26 FE 5G కోసమేనని టెక్ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. లీక్‌ల ప్రకారం ఇందులో 6.7 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్ప్లే ఉండనుంది. ఈ స్క్రీన్ 2340 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. గరిష్ఠంగా 1900 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందించవచ్చని సమాచారం. దీంతో వీడియోలు, గేమింగ్, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను మంచి విజువల్ క్వాలిటీతో చూడొచ్చు.

పనితీరు విషయానికి వస్తే గెలాక్సీ S26 FE 5Gలో శాంసంగ్ సొంత Exynos 2500 చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉంది. దీనికి 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ జతకానున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9తో వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన కొత్త ఫోల్డబుల్ ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9ను అందించింది. అదే సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని గెలాక్సీ S26 FEలోనూ అందించే అవకాశం ఉంది.

కెమెరా, బ్యాటరీ

కెమెరాల విషయానికి వస్తే ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుందని సమాచారం. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరాతో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12MP కెమెరాను అందించనున్నట్లు సమాచారం. Galaxy S26 FE 5Gలో 4,900mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుందని సమాచారం.

బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్ కలయికతో సాధారణ వినియోగంలో రోజంతా బ్యాకప్ అందించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రే, మింట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే ధర, ఇండియా విక్రయ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లపై శాంసంగ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫోన్ మార్కెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Follow Us