AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఇదిగో రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. తెలంగాణలో ఉత్తర, తూర్పు జిల్లాల్లోనూ వర్ష సూచన ఉంది. అక్టోబర్‌ 4న కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులకు IMD హెచ్చరిక జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఇదిగో రిపోర్ట్
Weather Update
Shaik Madar Saheb
|

Updated on: Oct 04, 2026 | 6:55 AM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఏపీ వెదర్ రిపోర్ట్..

ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదివారం (04-10-2026) అనకాపల్లి, కాకినాడ, కోణసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అక్కడక్కడ మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది. అంతేకాకుండా.. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది?

తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31డిగ్రీల నుంచి 32డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుంచి 23 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us