చరిత్ర సృష్టించిన వందే భారత్..! చీనాబ్ వంతెనపై దూసుకెళ్లిన సెమీ హైస్పీడ్ రైలు
వందే భారత్ రైలు జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నది వంతెనపై 100 కి.మీ/గం వేగంతో దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ రైల్వే వంతెన (నది నుండి 359 మీటర్లు)పై విజయవంతమైన ట్రయల్ రన్ పూర్తిచేసింది. ఇది కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా అనుసంధానిస్తుంది, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతమిస్తుంది. భారతీయ రైల్వేల ఈ ఘనత ప్రశంసనీయం.

వందే భారత్ ట్రైనే అద్భుతం అనుకుంటే.. అది మరిన్ని రికార్డులు సృష్టిస్తూ ముందుకెళ్తోంది. లేటెస్టుగా అలాంటి ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. అత్యంత వేగంగా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుస్తున్న వందేభారత్ ట్రైన్… ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై పరుగులు పెట్టింది. జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నది వంతెనపై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా జరిగిన ట్రయల్ రన్‌లో, ఈ సెమీ హైస్పీడ్ రైలు ఏకంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది
నదీ తీరం నుంచి 359 మీటర్ల ఎత్తులో, ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన ఈ ఇంజనీరింగ్ అద్భుతంపై… రైలు ప్రయాణించిన దృశ్యాలు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణం, భారీ గాలులను కూడా తట్టుకునేలా నిర్మించిన ఈ వంతెనపై, వందేభారత్ రైలు ఎంతో సురక్షితంగా, వేగంగా ప్రయాణించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
ఈ మార్గంలో త్వరలోనే వందేభారత్ రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే కాశ్మీర్ లోయను… భారత్‌లోని ఇతర ప్రాంతాలతో వేగంగా అనుసంధానించడమే కాకుండా, పర్యాటక రంగానికి, రక్షణ రంగానికి ఊతమివ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారతీయ రైల్వే సాధించిన ఈ ఘనతపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ రూట్‌లో… రెగ్యులర్‌గా వందే భారత్ సర్వీసుల కోసం పర్యాటక ప్రియులు ఎదురుచూస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
