AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 4 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, డబ్బు, వివాహ విషయాల్లో గుడ్‌న్యూస్

Horoscope Today (October 4, 2026): ఆదివారం 12 రాశుల వారికి గ్రహాల అనుకూల, ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. మేష రాశి వారికి పట్టుదలతో చేపట్టిన పనుల్లో విజయం, ఆదాయ వృద్ధి సూచనలు ఉండగా.. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు అధికార యోగానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అక్టోబర్ 4 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, డబ్బు, వివాహ విషయాల్లో గుడ్‌న్యూస్
Horoscope Today 04 October 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 04, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 4, 2026): మేష రాశి వారు ఏ పని తలపెట్టినా పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆశించినంతగా సంపాదన పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ పని తలపెట్టినా పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆశించినంతగా సంపాదన పెరుగుతుంది. కొన్ని వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కొత్త పరిచయాలు విస్తృతమవుతాయి. ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనీ వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు. విద్యార్థుల మీద ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఏ పని తలపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. కుటుంబ పెద్దల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. బంధువులతో పట్టు విడుపులతో వ్యవహరించడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులకు బావుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక లావాదేవీలకు, డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపా రాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమల్లో ముందంజ వేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. పిల్లల విషయాలకు సంబంధించి కొద్దిగా ఆందోళన, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా పురోగమిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో గడపడం జరుగుతుంది. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కార మవుతాయి. పనులన్నీ సంతృప్తికరంగా, సకాలంలో పూర్తవుతాయి. సమయం బాగా అనుకూ లంగా ఉన్నందువల్ల ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థుల చదువులు సవ్యంగా సాగు తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. కొద్దిపాటి శ్రమతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. పెండింగ్ పనులన్నీ చాలావరకు పూర్తవుతాయి. రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. కుటుంబ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. డాక్టర్లు, లాయర్లు, తదితర వృత్తులవారికి డిమాండ్ పెరుగుతుంది. ఐ.టి రంగంవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంపాదనకు లోటు ఉండదు. కానీ, కొందరు బంధు మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ఆరోగ్యానికి లోటుండదు. పిల్లల చదువుల విషయంలో ఆశించిన వార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో పోటీ పెరిగినా నష్టమేమీ ఉండదు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది. ప్రయాణాల్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో శుభ వార్తలు వింటారు. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వపరంగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొందరు బంధు మిత్రుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం.

Follow Us