AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: అక్టోబర్ నెలలో వీరి అదనపు ఆదాయ ప్రయత్నాలు సక్సెస్!

October 2026 Money Astrology: అక్టోబర్ నెలలో శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాల్లో మంచి పురోగతి కనిపించే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం గట్టిగా ప్రయత్నించే వారికి విజయావకాశాలు పెరుగుతాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు.

Money Astrology: అక్టోబర్ నెలలో వీరి అదనపు ఆదాయ ప్రయత్నాలు సక్సెస్!
Money Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 03, 2026 | 5:10 PM

Share

జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశ్యధిపతితో పాటు శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నప్పుడు ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద పట్టుదల బాగా పెరుగుతుంది. అక్టోబర్ నెలంతా (October 2026 Astrology) శుభ గ్రహాల అనుకూల సంచారం కొన్ని రాశుల వారు అదనపు ఆదాయ ప్రయత్నాల మీద ఎక్కువ సమయాన్ని, ఎక్కువ శక్తిని వినియోగించడం జరుగుతుంది. వీరికి ధన సంపాదన మీద ఆశపెరగడం, అందుకు తగ్గట్టుగా గట్టి ప్రయత్నాలు సాగించడం, చివరికి విజయం సాధించడానికి బాగా అవకాశం ఉంది. ఆ రాశులుః మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకరం. ఈ రాశుల వారు ఈ సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.

మేషం

ఈ రాశికి అక్టోబర్ నెలంతా గురు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అదనపు ఆదాయం మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. ధన కారకుడైన గురువు చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల అదనపు ఆదాయం కోసం వీరు నిర్విరామంగా కృషి చేసే అవకాశం ఉంది. అనేక ఆదాయ మార్గాలు చేతికి అందడం జరుగుతుంది. వీరి ప్రయత్నాలు నూరు శాతం ఫలించి ఆదా యం విశేషంగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.

మిథునం

రాశ్యధిపతి బుధుడితో సహా శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలను కనుగొనే ప్రయత్నం చేస్తారు. ఆలోచనా స్థానమైన పంచమ స్థానంలో బుదుడు ప్రవేశించడం వల్ల అదనపు ఆదాయానికి ఒక ప్రణాళిక ప్రకారం కృషి చేస్తారు. రావలసిన సొమ్మును, బాకీలను పట్టుదలగా రాబట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లావాదేవీలు పెర గడం, కార్యకలాపాలు విస్తృతం కావడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కర్కాటకం

ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితి, చతుర్థ స్థానంలో బుధ, శుక్రులు సంచారం చేస్తుండడం వల్ల ఆర్థి కాభివృద్ధి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు సాగించడంతో పాటు, ఖర్చుల్ని తగ్గించుకోవడం, పొదుపు చర్యలను పాటించడం వంటివి కూడా జరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచి లబ్ధి పొందుతారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. రావలసిన డబ్బు, బాకీల కోసం గట్టిగా ప్రయత్నించి చివరికి లక్ష్యాన్ని సాధిస్తారు.

కన్య రాశి

ఈ రాశికి లాభ స్థానంలో ఉచ్ఛ గురువు, ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడు, శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి సంపన్నులు కావడమే ప్రధాన లక్ష్యంగా మారుతుంది. ఆస్తిపాస్తులకు సంబం ధించిన సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయం కోసం ఎక్కువ సమ యాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఐశ్వర్యవంతులు కావాలన్న ఆశయాన్ని సాధించడానికి ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటారు. వీరికి ఆదనపు ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.

తుల రాశి

ఈ రాశిలో శుక్ర, బుధుల సంచారంతో పాటు దశమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందు వల్ల అదనపు ఆదాయం కోసం ఈ రాశివారు తమకు అందిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయాన్ని ఏదో విధంగా పెంచుకోవాలన్న తపన పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులే షన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల మీద వీరు పెట్టే పెట్టుబడులు ఊహించని లాభాలని స్తాయి ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తుల మీద లాభాలు పెరుగుతాయి.

మకరం

ఈ రాశికి సప్తమంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు, దశమంలో ఉన్న బుధ, శుక్రులతో పాటు, ధన స్థానాధిపతి శని కూడా బలంగా ఉన్నందు వల్ల స్వల్ప ప్రయత్నంతో ఈ రాశివారి ఆదాయం ఇబ్బ డిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాల మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. వీరు చేపట్టే ప్రయత్నాలు ఫలించి వీరి ఆర్థిక స్వప్నాలు సాకారం అవుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. అదనపు ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య ఫలితాలు, అంచనాలు సంప్రదాయ జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాలు, గ్రహాల సంచారాల ఆధారంగా మాత్రమే అందించబడుతున్నాయి. వీటిని ఖచ్చితమైన భవిష్యవాణిగా పరిగణించకండి. వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులు, దశలు, ఇతర అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు.

Follow Us