Samsung Galaxy F70 5G..రూ.17,999కే సొంతం చేసుకునే ఛాన్స్..ఫీచర్లు ఇవే!

October 23, 2026

Subhash

Galaxy F70 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఆకర్షణీయమైన డిస్‌ప్లే, 50MP కెమెరా, పెద్ద బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి.

50MP కెమెరా

ఈ ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. 6GB RAM + 128GB మోడల్ ధర రూ.22,999. బ్యాంక్ ఆఫర్లతో అర్హులైన కొనుగోలుదారులకు బేస్ మోడల్ రూ.17,999 లభిస్తుంది.

ఫోన్ ధర ఎంత?

ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల Full HD+ Super AMOLED డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. స్క్రీన్‌కు Gorilla Glass Victus రక్షణ కూడా అందించారు.

డిస్‌ప్లే

ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు మూడు కెమెరాలు. మెయిన్‌ కెమెరా 50MPతో పాటు OIS సపోర్ట్. 5MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్‌ 13MP కెమెరా.

50MP కెమెరా

ఈ ఫోన్‌లో శాంసంగ్ ఎక్సినోస్ 1330 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. 4GB, 6GB RAM ఆప్షన్‌లలో ఉన్నాయి. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు.

ప్రాసెసర్ 

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సాధారణ వినియోగంలో రోజంతా ఉపయోగించుకునేలా బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు. 

బ్యాటరీ

ఈ ఫోన్ Android 15 బేసిడ్‌పై పని చేస్తుంది. నాలుగేళ్ల Android OS అప్‌డేట్స్, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని శాంసంగ్ ప్రకటించింది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్

Galaxy F70 5G Bold Black, Vivid Violet రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆఫర్లు, ధరలు మారవచ్చని గుర్తించుకోండి.

ఏ రంగుల్లో లభిస్తుంది?