AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 23 రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా కలిసొచ్చే రోజు.. మీ రాశి ఫలితం ఇదే!

Horoscope Today (October 23, 2026): శుక్రవారం 12 రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి? కొందరికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఎదురవుతుంటే, మరికొందరికి వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం వంటి విషయాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

అక్టోబర్ 23 రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా కలిసొచ్చే రోజు.. మీ రాశి ఫలితం ఇదే!
Daily Horoscope 23 October 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 23, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 23, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాగా శ్రమ, ఒత్తిడి ఉండే అవకాశముంది. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. మిథున రాశి వారికి రావలసిన డబ్బు అవసర సమయంలో చేతికి అందుతుంది. చిన్నా చితకా సమస్యలు పరిష్కార మవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి సంపాదన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు ఒక కొలిక్కి వస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభి స్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బాగా శ్రమ, ఒత్తిడి ఉండే అవకాశముంది. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రావలసిన డబ్బు అవసర సమయంలో చేతికి అందుతుంది. చిన్నా చితకా సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఉద్యోగంలో కొన్ని కొత్త లక్ష్యాలు చేపట్టడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. బంధువు లకు సంబంధించిన శుభకార్యంలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా ప్రోత్సాహకరంగా సాగు తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరు మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశముంది. దగ్గర బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. దగ్గర బంధువులతో సామరస్యం పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టు దలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గు తుంది. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇంటి విషయాల్లో ఏకపక్షంగా వ్యవ హరించడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలను విస్తరించే విషయం ఆలోచిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవకార్యాలు నిర్వహిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల పరిస్థితి కూడా మెరుగ్గా, ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. మిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు త్వరగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు కొన్ని కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆదాయానికి కొరత ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా పూర్తి స్థాయిలో ఫలిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యో గాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. రావలసిన డబ్బు సమయానికి చేతికి అంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులకు సాయం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఆశాజనకంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది మార్పులతో లాభాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. ప్రయాణాలు లాభి స్తాయి. ఆశించిన శుభవార్తలు వినే అవకాశముంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు పెరుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు క్రమంగా లాభాల బాట పడతాయి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో అధికారులకు అండగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు పూర్తిగా మారే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలపరంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. సోద రులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. కొందరు బంధువుల వల్ల డబ్బు న‌ష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, కొన్ని అనుకోని కుటుంబఖర్చులు తప్పకపోవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం కని పిస్తుంది. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు కూడా లాభిస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. కుటుంబ జీవితం సానుకూలంగా సాగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

Follow Us