AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: ఈ ఏడాదంతా వారికి ఆర్థిక కష్టాలు. ఖర్చులు విషయంలో జాగ్రత్త..!

Money Astrology: దసరా తర్వాత నుంచి డిసెంబర్ మొదటి వారం లోపు కొన్ని రాశులకు ఖర్చు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యయ స్థానం (అంటే 12వ స్థానం) వ్యయాధిపతి బాగా బలంగా ఉన్నందువల్ల వీరికి ఆదాయం కంటే ఖర్ఛు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశులవారు ఖర్చుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. మేషం, వృషభం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులవారికి అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు, శుభ కార్యాల మీద ఖర్చులు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. వీరు తరచూ శివార్చన చేయించడం, గణపతి స్తోత్రం పఠించడం వల్ల ఆదాయం నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 22, 2026 | 4:00 PM

Share
మేషం: ఈ రాశివారికి ఇక నుంచి ఖర్చులు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చు ఉండడానికి ఈ రాశివారికి ఏలిన్నాటి శని జరుగుతూ ఉండడం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వృథా ఖర్చులు ఎక్కువగా ఉండడం, తరచూ ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడంతో పాటు ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది. వీలైనంతగా పొదుపు చేయడం, మదుపు చేయడం శ్రేయస్కరం.

1 / 6
వృషభం: ఈ రాశివారికి వ్యయ స్థానాధిపతి అయిన కుజుడు తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం వల్ల గృహ నిర్మాణం, ఆస్తి వివాదాల పరిష్కారం, భూముల కొనుగోలు వంటి విషయాల వల్ల ఖర్చు బాగా పెరిగి చేతిలో డబ్బు నిలవ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబం మీద కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కష్టార్జితం ఖర్చయిపోవడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకోవడం మంచిది.

2 / 6
తుల: ఈ రాశికి వ్యయాధిపతి అయిన బుధుడు ఇదే రాశిలో సంచారం వల్ల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి, విలాస జీవితానికి డబ్బు బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. తరచూ వైద్య ఖర్చులు కూడా తప్పకపోవచ్చు. పైగా ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు బాగా తగ్గవచ్చు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉండవచ్చు. ఆర్థిక నిర్వహణ బాధ్యతల్ని జీవిత భాగస్వామికి అప్పగించడం వల్ల బాగా ఉపయోగం ఉంటుంది.

3 / 6
వృశ్చికం: వ్యయ స్థానంలో వ్యయాధిపతి శుక్రుడు జనవరి 5వరకు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి విలాసాల మీదా, చికిత్సల మీదా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. తీర్థయాత్రలు, విహార యాత్రలకు కూడా బాగా అవకాశం ఉంది. వచ్చే రెండు నెలల్లో వీరి ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయ వృద్ధికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది. తప్పని సరిగా పొదుపును అలవాటు చేసుకోవడం, షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపు చేయడం మంచిది.

4 / 6
మకరం: ఈ రాశికి వ్యయాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఆకస్మిక వ్యయానికి బాగా అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రయాణాల వల్ల నష్టపోవడం కూడా జరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు నిర్వహించడం,  కుటుంబ ఖర్చులు బాగా పెరగడం, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుంది. అక్టోబర్ 31 తర్వాత ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ది చెందకపోవచ్చు. వీలైనంతగా మదుపు చేయడం మంచిది.

5 / 6
మీనం: ఈ రాశిలో వ్యయాధిపతి శని, వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండడం అంత మంచిది. ఏలిన్నాటి శని వల్ల ఆదాయం తగ్గడం, ఖర్చులు అదుపు తప్పడం, ఆర్థికంగా నష్టపోవడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. మిత్రులు తప్పుదోవ పట్టించడం వల్ల ఆర్థికంగా మోసపోవడం కూడా జరుగుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

6 / 6
Follow Us