హారతి కర్పూరం లేదా పచ్చ కర్పూరం ఏదైనా ఉపయోగించవచ్చు. దీనిని మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి. కర్పూరం చర్మం దురద, ఎరుపుదనం, ఇరిటేషన్‌ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇంట్లో కలబంద మొక్క ఉంటే, దాని నుండి సహజసిద్ధమైన జెల్ తీసుకోవడం ఉత్తమం. లేని పక్షంలో మార్కెట్లో లభించే అలోవెరా జెల్‌ను ఒక 1 1/2 టీస్పూన్ వరకు తీసుకోవచ్చు. అలోవెరా జెల్ చర్మం ఎరుపుదనం, గజ్జి, తామర వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది, చర్మాన్ని శమింపజేస్తుంది. చివరగా అర స్పూన్ పసుపును కలుపుకోవాలి. పసుపులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆక్నే, ముడతలు, మచ్చలు, గజ్జి, తామర వంటి అనేక చర్మ సమస్యలను నివారించడంలో బాగా సహాయపడతాయి. ముందుగా శుభ్రంగా కడిగిన లేత వేపాకులను రోట్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి. ఆ తర్వాత కర్పూరాన్ని కూడా రోట్లో వేసుకుని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు వేపాకు పేస్ట్, కర్పూరం పొడి, 1 1/2 టీస్పూన్ అలోవెరా జెల్, అర స్పూన్ పసుపును ఒక గిన్నెలో వేసుకుని అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.