AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుర్గమ్మ నిమజ్జన వేళ కంటతడి పెట్టిన చిన్నారులు.. అమ్మను విడిచిపెట్టలేక రోదించిన వైనం సోషల్ మీడియాలో వైరల్!

శరన్నవరాత్రులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న జగన్మాతను సాగనంపే వేళ ప్రతి ఒక్కరిలోనూ ఉద్వేగం కనిపిస్తుంది. అయితే, ఖమ్మం జిల్లా కూసుమంచిలో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. అమ్మవారి నిమజ్జనాన్ని చూసి తట్టుకోలేక ఇద్దరు చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

దుర్గమ్మ నిమజ్జన వేళ కంటతడి పెట్టిన చిన్నారులు.. అమ్మను విడిచిపెట్టలేక రోదించిన వైనం సోషల్ మీడియాలో వైరల్!
Durga Idol Immersion
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 23, 2026 | 12:03 PM

Share

ఖమ్మం జిల్లా కూసుమంచిలో శరన్నవరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా జరిగిన దుర్గామాత విగ్రహ నిమజ్జన ఘట్టం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రాంతంలో శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు బతుకమ్మలతో ఆడిపాడుతూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. అయితే తొమ్మిది రోజుల పూజల అనంతరం దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా తీసుకెళ్లే క్రమంలో అసలు భావోద్వేగ దృశ్యం ఆవిష్కృతమైంది.

పూజశ్రీ, చున్నిత అనే చిన్నారులు దుర్గామాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడాన్ని చూసి ఓర్వలేకపోయారు. అమ్మను నీళ్లలో నిమజ్జనం చేయవద్దు, మా అమ్మను మాకు వదిలేయండి అంటూ ఆ పసిమొగ్గలు బోరున రోదించారు. విగ్రహాన్ని విడిచిపెట్టలేక ఏడుస్తూ, దాని చుట్టూ తిరుగుతూ వారు చూపిన అమాయకత్వం అక్కడున్న భక్తులను సైతం తీవ్రంగా కలచివేసింది.

తొమ్మిది రోజుల పాటు తమ ఇంటి సభ్యురాలిగా, ఒక ప్రాణమున్న మనిషిలా దుర్గమ్మను ఆరాధించిన ఆ చిన్నారులకు… ఆ తల్లిని దూరం చేయడం ఏమాత్రం ఇష్టం కాలేదు. నిమజ్జన వేళ అమ్మవారి విగ్రహం కదిలిపోతుంటే ఆ పసిమనసులు తట్టుకోలేకపోయాయి. చిన్న వయసులోనే దేవుడిపై వారు చూపిన నిష్కల్మషమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమ అక్కడి పెద్దలను సైతం ఆలోచింపజేశాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దైవభక్తిలో ఎలాంటి కల్మషం ఉండదని, చిన్నారుల కన్నీళ్లు అమ్మవారిపై వారికున్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పండగ ఆనందాల మధ్య ఈ భావోద్వేగ దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది.

Follow Us