AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంపై పేరుకుపోయిన మురికి, నలుపును ఎలా తొలగించాలి? సురక్షితమైన చిట్కాలు, జాగ్రత్తలు

మెడ, మోచేతులు, మోకాళ్లపై పేరుకుపోయిన నలుపును చాలామంది జిడ్డు లేదా మట్టి అనుకుని గట్టిగా రుద్దుతుంటారు. అయితే ఇది కేవలం మురికి మాత్రమే కాదు, ట్యాన్ లేదా పిగ్మెంటేషన్ కూడా కావచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చిట్కాలను చర్మంపై నేరుగా వాడటం వల్ల మంట, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. చర్మాన్ని సురక్షితంగా శుభ్రం చేయడానికి ఏం చేయాలి..? ఇందుకోసం సాధారణ ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

శరీరంపై పేరుకుపోయిన మురికి, నలుపును ఎలా తొలగించాలి? సురక్షితమైన చిట్కాలు, జాగ్రత్తలు
Dark Skin Patches
Jyothi Gadda
|

Updated on: Oct 23, 2026 | 7:51 AM

Share

మనలో చాలామంది ముఖ సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యతను మెడ, మోచేతులు, మోకాళ్ల సంరక్షణకు ఇవ్వరు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో చర్మం నల్లగా మారడం లేదా మురికి పేరుకుపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో చాలామంది దాన్ని సాధారణ మట్టి అనుకుని లూఫా లేదా స్క్రబ్‌తో గట్టిగా రుద్దుతుంటారు. అయితే, ఈ నలుపు కేవలం మురికి మాత్రమే కాకుండా ట్యానింగ్, ఘర్షణ లేదా పిగ్మెంటేషన్ వల్ల కూడా రావచ్చు.

సోషల్ మీడియా చిట్కాలతో జాగ్రత్త:

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో నిమ్మకాయ, ఈనో, షాంపూ, కాఫీ పొడిని కలిపి నలుపు ఉన్న చోట రాస్తే నిమిషాల్లో మురికి పోతుందనే వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ, వీటిని వాడటం చర్మానికి తీవ్ర హాని కలిగిస్తుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిమ్మకాయలో ఉండే యాసిడ్ చర్మంపై మంటను కలిగిస్తుంది. ఈనో చర్మం కోసం తయారుచేసినది కాదు, అలాగే షాంపూ కేవలం జుట్టు పరిశుభ్రత కోసమే. వీటిని చర్మంపై వాడటం వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది.

సరియైన శుభ్రత, సంరక్షణ పద్ధతులు:

మైల్డ్ క్లెన్సింగ్:

ఇవి కూడా చదవండి

శరీరంపై ఉన్న మురికి, చెమటను తొలగించడానికి సబ్బుకు బదులుగా సున్నితమైన మైల్డ్ క్లెన్సర్, గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. చర్మాన్ని గట్టిగా రుద్దకుండా తేలికపాటి చేతులతో శుభ్రం చేసుకోవాలి.

మాయిశ్చరైజేషన్:

స్నానం చేసిన వెంటనే చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ రాయడం చాలా ముఖ్యం. మోచేతులు, మోకాళ్ల వద్ద చర్మం త్వరగా పొడిబారుతుంది, కాబట్టి అక్కడ క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

సన్‌స్క్రీన్ వాడకం:

ఎండ దెబ్బకు మెడ, చేతులు ట్యాన్ అయి నల్లగా మారతాయి. కాబట్టి బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ రాయడం మరువకూడదు.

సహజమైన చిట్కా – పాలు, పసుపు, తేనె:

ట్యానింగ్ తగ్గించుకోవడానికి ఇంట్లోనే సురక్షితమైన పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఒక స్పూన్ పాలు, ఒక స్పూన్ పసుపు, అర స్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా చేసి నలుపు ఉన్న ప్రాంతంలో రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఒకవేళ చర్మంపై నలుపు చాలా కాలంగా ఉండి, మందంగా మారుతుంటే సొంత వైద్యం చేయకుండా డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
'మాయలేడి' సినిమా రివ్యూ..
'మాయలేడి' సినిమా రివ్యూ..
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్
టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
జబర్దస్త్‌లోకి 'అగ్నిపరీక్ష' రాజకుమారి..ఎవరి టీమ్‌లో చేస్తుందంటే?
జబర్దస్త్‌లోకి 'అగ్నిపరీక్ష' రాజకుమారి..ఎవరి టీమ్‌లో చేస్తుందంటే?
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో