AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయిలీ స్కిన్‌కి ఇవే బెస్ట్ టిప్స్.. రోజంతా ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించండి!

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ చర్మ సమస్యల్లో జిడ్డుగల చర్మం ఒకటి. మన చర్మంలోని తైల గ్రంథులు అతిగా నూనెను ఉత్పత్తి చేయడం వల్ల ముఖం ఎప్పుడూ జిడ్డుగా, నిసత్తువగా కనిపిస్తుంది. దీనివల్ల మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటి సమస్యలు చుట్టుముడతాయి. అయితే సరైన చర్మ సంరక్షణ పద్ధతులను పాటించడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు.

ఆయిలీ స్కిన్‌కి ఇవే బెస్ట్ టిప్స్.. రోజంతా ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించండి!
Oily Skin Care Routine
Jyothi Gadda
|

Updated on: Oct 23, 2026 | 7:30 AM

Share

జిడ్డుగల చర్మం ఉన్నవారు తరచుగా మొటిమలు, మృత కణాలు, అధిక నూనె ఉత్పత్తి సమస్యలను ఎదుర్కొంటారు. దీనిని నియంత్రించడానికి సరైన రోజువారీ చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. సరైన జీవనశైలి, సమతుల్య ఆహారంతో జిడ్డు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం పాటించాల్సిన మరికొన్ని చిట్కాలు, నియమాలేంటో పూర్తి డిటెల్స్‌ ఇప్పుడు చూద్దాం..

సున్నితమైన క్లెన్సింగ్:

జిడ్డు చర్మం ఉన్నవారు ముఖాన్ని తరచుగా కడుక్కుంటూ ఉంటారు. కానీ, అలా చేయడం వల్ల చర్మం మరింత పొడిగా మారి, మరింత ఎక్కువ నూనె ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, రోజులో కేవలం రెండు సార్లు మాత్రమే ఆయిల్-ఫ్రీ, జెల్-బేస్డ్ లేదా ఫోమింగ్ ఫేస్‌వాష్‌ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖంపై పేరుకున్న ఆయిల్‌, జిడ్డు అదనపు సెబమ్‌ను తొలగిస్తుంది.

టోనర్ వాడకం:

క్లెన్సింగ్ తర్వాత ఆల్కహాల్ లేని టోనర్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇది చర్మం pH స్థాయిలను సమతుల్యం చేయడంతో పాటు, పెద్దదిగా మారిన రంధ్రాలను బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఎక్స్‌ఫోలియేషన్:

చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించడానికి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మైల్డ్ స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. ఇది రంధ్రాలు మూసుకుపోకుండా నివారిస్తుంది. చర్మాన్ని తాజాపరుస్తుంది. అయితే అతిగా స్క్రబ్ చేయడం వల్ల చర్మానికి హాని జరుగుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి.

ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్:

చర్మం జిడ్డుగా ఉంది కదా అని మాయిశ్చరైజర్ రాయడం మానేయకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు. చర్మానికి తగిన తేమ అందకపోతే గ్రంథులు మరింత నూనెను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి, ఎప్పుడూ లైట్-వెయిట్, వాటర్-బేస్డ్ లేదా ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి.

సన్‌స్క్రీన్ :

ఉదయం పూట బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా నాణ్యమైన సన్‌స్క్రీన్‌ను రాసుకోవాలి. ఇది సూర్యుని నుండి వచ్చే హానికరమైన యూవీ (UV) కిరణాల నుండి చర్మాన్ని రక్షించి, ముఖంపై ముడతలు పడకుండా కాపాడుతుంది. అదనంగా, తగినంత నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా జిడ్డు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us