AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ హైకోర్టులో 119 సివిల్ జడ్జి ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.1.36 లక్షలు! ఎలా ఎంపిక చేస్తారంటే..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో 119 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లా డిగ్రీతో పాటు నిర్దేశిత అర్హతలు ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 26, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వోస్ ద్వారా ఎంపిక ఉంటుంది. జీతం నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు ఉంటుంది. ఈ కిండి డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..

ఏపీ హైకోర్టులో 119 సివిల్ జడ్జి ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.1.36 లక్షలు! ఎలా ఎంపిక చేస్తారంటే..
AP High Court Civil Judge Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 04, 2026 | 7:00 AM

Share

లా డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ న్యాయ సేవల్లో కెరీర్‌ కొనసాగించాలనుకునే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ గుడ్‌న్యూస్‌ అందించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 26, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ (గ్రాడ్యుయేషన్‌) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే హైకోర్టు సర్వీస్, డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీ, ప్రాసిక్యూషన్ సర్వీస్ లేదా సంబంధిత ఇతర ప్రభుత్వ శాఖల్లో నిర్దేశిత అర్హతలకు అనుగుణంగా పనిచేస్తూ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి సెప్టెంబర్ 1, 2026 నాటికి వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 26, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లికేషన్‌ పూర్తి చేసుకోవడం మంచిది. దరఖాస్తు ఫీజు కింద ఓసీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు: రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ఈ నియామక ప్రక్రియను మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది 100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. ఈ పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను తదుపరి రాత పరీక్షకు 1:10 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. పేపర్-I: సివిల్ లా – 100 మార్కులు, పేపర్-II: క్రిమినల్ లా – 100 మార్కులు, పేపర్-III: ఇంగ్లీష్ – అనువాదం, వ్యాస రచన – 100 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను వైవా-వోస్/ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ దశకు 50 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)గా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు వేతనం లభిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.

న్యాయ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఈ నియామకం మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్హత, సర్వీస్‌/అనుభవానికి సంబంధించిన నిబంధనలు, వయోపరిమితి, రిజర్వేషన్‌, ఇతర అర్హతలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.

ఏపీ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us