AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంతితో కాదు బ్యాట్‌తో 52 బంతుల్లో విధ్వంసం.. సెలక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధోని దోస్త్..!

Anshul Kamboj Duleep Trophy: టీమిండియాకు దూరమైన హర్యానా పేసర్ అన్షుల్ కంబోజ్ దులీప్ ట్రోఫీలో ఊహించని మెరుపులతో విరుచుకుపడ్డాడు. బంతితో కాకుండా బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి జట్టును ఆదుకున్నాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారీ సిక్సర్లతో చెలరేగి, జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం సెలక్టర్ల తలుపు తట్టాడు.

బంతితో కాదు బ్యాట్‌తో 52 బంతుల్లో విధ్వంసం.. సెలక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధోని దోస్త్..!
Anshul Kamboj Duleep Trophy
Venkata Chari
|

Updated on: Aug 24, 2026 | 7:35 AM

Share

Anshul Kamboj Duleep Trophy: బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా వెస్ట్ జోన్‌తో మొదలైన దులీప్ ట్రోఫీ 2026 మ్యాచ్‌లో నార్త్ జోన్ తరఫున ఆడుతున్న అన్షుల్ కంబోజ్ వీరోచిత పోరాటం కనబరిచాడు. 51.4 ఓవర్లలో 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి నార్త్ జోన్ పీకల్లోతు కష్టాల్లో పడిన వేళ, తొమ్మిదో స్థానంలో క్రీజులోకి వచ్చిన కంబోజ్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 52 బంతుల్లోనే 60 పరుగులు పిండుకుని మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా నార్త్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 66.5 ఓవర్లలో 251 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

తోక బ్యాటర్లతో విలువైన భాగస్వామ్యాలు..

కేవలం ధనాధన్ షాట్లతోనే కాకుండా టెయిలెండర్లను సమర్థంగా నడిపిస్తూ అన్షుల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఎనిమిదో వికెట్‌కు అబిద్ ముస్తాక్‌తో కలిసి 48 పరుగులు జోడించిన కంబోజ్, ఆ తర్వాత 11వ నంబర్ బ్యాటర్ సునీల్ కుమార్‌తో కలిసి ఆఖరి వికెట్‌కు 31 పరుగులు నెలకొల్పాడు. ఈ ఆఖరి భాగస్వామ్యంలో సునీల్ కుమార్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకపోవడం విశేషం. తుషార్ దేశ్‌పాండే, తనుష్ కోటియన్ లాంటి సీనియర్ బౌలర్ల బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ స్ట్రైక్ మొత్తం తన వద్దే ఉంచుకుని భారీ షాట్లతో అలరించాడు.

ఎక్కువమంది చదివినది: ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే పరేషానే..!

ఇవి కూడా చదవండి

టెస్టు జట్టులో చోటు కోల్పోయిన తర్వాత తొలిసారి..

గతేడాది ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా భారత టెస్ట్ జట్టులోకి అరంగేట్రం చేసిన 25 ఏళ్ల కంబోజ్, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఏకైక టెస్టులో 89 బౌలింగ్ సగటుతో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయడంతో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లకు ఎంపిక కాలేదు. గత రెండేళ్లుగా భారత జట్టు టెయిలెండర్లు బ్యాటింగ్‌లో పరుగులు చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, కంబోజ్ ప్రదర్శించిన ఈ ఆల్‌రౌండ్ నైపుణ్యం సెలక్టర్ల దృష్టిని బలంగా ఆకర్షించే వీలుంది.

ఫస్ట్ క్లాస్ ట్రాక్ రికార్డ్.. ఐపీఎల్‌లోనూ అగ్రగామి..

దేశవాళీ క్రికెట్‌లో అన్షుల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 24.04 సగటుతో ఏకంగా 105 వికెట్లు పడగొట్టాడు. 2025-26 రంజీ సీజన్‌లో హర్యానా తరఫున తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 13 వికెట్లు తీశాడు. అటు ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రధాన పేసర్‌గా ఎదిగిన కంబోజ్, 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. దీంతో రాబోయే 2027 ఐపీఎల్ సీజన్ కోసం సీఎస్కే అతడిని అట్టిపెట్టుకోవడం దాదాపు ఖాయమైంది.

ఎక్కువమంది చదివినది: SL vs IND 2nd Test: శుభ్‌మన్ గిల్ అరుదైన ప్రపంచ రికార్డ్.. ఈ దశాబ్దంలోనే ఎవరికీ సాధ్యం కాలేగా..!

బౌలింగ్‌తో పాటు ఆపత్కాలంలో బ్యాట్‌తోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగలనని అన్షుల్ కంబోజ్ రుజువు చేసుకున్నాడు. దేశవాళీలో నిలకడగా రాణిస్తూ, టెయిలెండర్‌గా మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఈ సీఎస్కే స్టార్ టీమిండియా రీఎంట్రీ రేసులో ముందంజలో నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us