AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుసగా 3 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు.. కట్‌చేస్తే.. సడన్‌గా రిటైర్మెంట్‌తో షాకిచ్చాడేంటి..?

Karn Sharma Retirement: టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలతో వరుసగా మూడు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన అరుదైన ఘనత సాధించిన ఈ 38 ఏళ్ల సీనియర్ బౌలర్, సుదీర్ఘ ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

వరుసగా 3 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు.. కట్‌చేస్తే.. సడన్‌గా రిటైర్మెంట్‌తో షాకిచ్చాడేంటి..?
Karn Sharma Retirement
Venkata Chari
|

Updated on: Aug 23, 2026 | 4:10 PM

Share

Karn Sharma Retirement: భారత సీనియర్ స్పిన్నర్ కర్ణ్ శర్మ అన్ని రకాల అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ పోటీల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆగస్టు 23న వెల్లడించాడు. యుపీ టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్, మీరట్ మావెరిక్స్ జట్ల మధ్య శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ ముగిసిన వెంటనే ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆగస్టు 25న లక్నో వేదికగా తన జట్టు తరఫున చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్న కర్ణ్, ఆ తర్వాత మైదానంలో పోటీల నుంచి పూర్తిగా తప్పుకోనున్నాడు. భవిష్యత్తులో కోచింగ్ బాధ్యతలు స్వీకరించడానికి ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం చేశాడు.

దశాబ్ద కాలం నాటి అంతర్జాతీయ కెరీర్..

2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మీరట్‌కు చెందిన కర్ణ్ శర్మ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా తరఫున ఒక టెస్టు, రెండు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ కాలం పాటు రైల్వేస్ జట్టుకు వెన్నెముకగా నిలిచిన అతను, ఆంధ్ర, విదర్భ జట్ల తరఫున కూడా దేశవాళీ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు.

ఎక్కువమంది చదివినది: SL vs IND 2nd Test: శుభ్‌మన్ గిల్ అరుదైన ప్రపంచ రికార్డ్.. ఈ దశాబ్దంలోనే ఎవరికీ సాధ్యం కాలేగా..!

తన ప్రయాణంలో సహకరించిన కుటుంబ సభ్యులు, బీసీసీఐ, రైల్వేస్, యుపీసీఏ, ఆంధ్ర, విదర్భ క్రికెట్ అసోసియేషన్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.

ఫస్ట్ క్లాస్, టీ20ల్లో బలమైన రికార్డులు..

దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 97 మ్యాచ్‌లు ఆడిన కర్ణ్ శర్మ 270 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 14 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు, రెండు సార్లు మ్యాచ్‌లో పది వికెట్ల ఘనతలు ఉన్నాయి. బ్యాటర్‌గానూ రాణించి ఫస్ట్ క్లాస్‌లో 2,866 పరుగులు చేశాడు.

లిస్ట్-ఎ విభాగంలో 123 మ్యాచ్‌ల్లో 153 వికెట్లు తీయడంతో పాటు 1827 పరుగులు జోడించాడు. సమగ్ర టీ20 ఫార్మాట్‌లో మొత్తం 191 మ్యాచ్‌లలో 168 వికెట్లు నేలకూల్చాడు.

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ‘హ్యాట్రిక్ ట్రోఫీ’ రికార్డు..

ఐపీఎల్ చరిత్రలో కర్ణ్ శర్మకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ, రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్లలో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న కొద్దిమంది క్రికెటర్లలో ఇతను ఒకడు. ఇంకా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫునా ఆడాడు.

ఎక్కువమంది చదివినది: ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే పరేషానే..!

మొత్తంగా 90 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 83 వికెట్లు సాధించాడు. 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆరు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు.

ముఖ్యంగా మూడు వేర్వేరు జట్లతో వరుసగా మూడు సీజన్లలో ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు:

2016: సన్‌రైజర్స్ హైదరాబాద్

2017: ముంబై ఇండియన్స్

2018: చెన్నై సూపర్ కింగ్స్

దేశవాళీ, ఐపీఎల్ రంగాల్లో తనదైన లెగ్ స్పిన్ మ్యాజిక్‌తో విశేష సేవలందించిన కర్ణ్ శర్మ కెరీర్‌ను విజయవంతంగా ముగించాడు. మైదానంలో ఆటకు వీడ్కోలు పలికినప్పటికీ, రాబోయే రోజుల్లో కోచ్‌గా యువ స్పిన్నర్లను తీర్చిదిద్దే సరికొత్త బాధ్యతల్లో భాగం కానున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రిటైర్మెంట్ ప్రకటించిన ధోని, కోహ్లీ, రోహిత్ దోస్త్..!
రిటైర్మెంట్ ప్రకటించిన ధోని, కోహ్లీ, రోహిత్ దోస్త్..!
ISRO స్పేస్‌ క్విజ్‌లో టెన్త్ బాలుడి సత్తా.. జాతీయ సదస్సుకు ఎంపిక
ISRO స్పేస్‌ క్విజ్‌లో టెన్త్ బాలుడి సత్తా.. జాతీయ సదస్సుకు ఎంపిక
రోటీన్‌గా కాకుండా ఇలా దోసె చేసి తింటే.. ఉక్కులాంటి శరీరం మీ సొంతం
రోటీన్‌గా కాకుండా ఇలా దోసె చేసి తింటే.. ఉక్కులాంటి శరీరం మీ సొంతం
శారీరక బలానికి, ఎముకల పుష్టికి ఒక్క లడ్డు చాలు.. ఎదిగే చిన్నారులక
శారీరక బలానికి, ఎముకల పుష్టికి ఒక్క లడ్డు చాలు.. ఎదిగే చిన్నారులక
టెక్‌ జాబ్‌ వదిలి ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి..
టెక్‌ జాబ్‌ వదిలి ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి..
ఏం చేసినా మంచిదే.. ఇంట్లో ఈ మొక్కలు ఉంటే అష్టకష్టాలే
ఏం చేసినా మంచిదే.. ఇంట్లో ఈ మొక్కలు ఉంటే అష్టకష్టాలే
పాముల్లో మంచి పాములు కూడా ఉంటాయని తెలుసా? ఎలా గుర్తించాలి అంటే?
పాముల్లో మంచి పాములు కూడా ఉంటాయని తెలుసా? ఎలా గుర్తించాలి అంటే?
ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఏ అంతస్తు శుభప్రదమో..
ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఏ అంతస్తు శుభప్రదమో..
చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే..!
చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే..!
గ్యాస్ వినియోగదారులకు లాస్ట్ ఛాన్స్.. నేడే చివరి అవకాశం..
గ్యాస్ వినియోగదారులకు లాస్ట్ ఛాన్స్.. నేడే చివరి అవకాశం..