AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే పరేషానే..!

Bangladesh vs Australia: ఆస్ట్రేలియా పర్యటనలో బంగ్లాదేశ్ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. మ్యాకే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు పేస్ ధాటికి బంగ్లా బ్యాటర్లు పేకమేడలా కుప్పకూలారు. మ్యాచ్ మొత్తం దారుణంగా విఫలమైన ఆ జట్టు, టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పలు అవాంఛిత రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే పరేషానే..!
Aus Vs Ban 2nd Test
Venkata Chari
|

Updated on: Aug 23, 2026 | 3:52 PM

Share

Bangladesh vs Australia Records: మ్యాకే మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ జట్టు ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కేవలం 10 ఓవర్లలో 12 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి బంగ్లా నడ్డి విరిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కేవలం 64 పరుగులకే ఆలౌట్ అయింది. టెస్టు చరిత్రలో బంగ్లాదేశ్‌కు ఇది నాల్గవ అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కేవలం 34 ఓవర్లలోనే తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్లు బంగ్లాదేశ్‌ను ఇంత తక్కువ ఓవర్లలో ఆలౌట్ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి.

డకౌట్ల వరద.. టాప్ ఆర్డర్ ఘోర వైఫల్యం..

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. షాద్‌మన్ ఇస్లాం, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంతో, లిట్టన్ దాస్ నలుగురూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియాపై ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాటర్లు డకౌట్ కావడం ఇదే ప్రథమం. ఇద్దరు ఓపెనర్లు డకౌట్ కావడం బంగ్లాదేశ్ టెస్టు చరిత్రలో ఇది నాలుగోసారి. టాప్-6 బ్యాటర్లలో నలుగురు సున్నాకే వెనుదిరగడంతో జట్టు పతనం శరవేగంగా ముగిసింది.

ఎక్కువమంది చదివినది: SL vs IND 2nd Test: శుభ్‌మన్ గిల్ అరుదైన ప్రపంచ రికార్డ్.. ఈ దశాబ్దంలోనే ఎవరికీ సాధ్యం కాలేగా..!

21 ఏళ్ల తర్వాత టెస్టుల్లో అరుదైన పరాభవం..

రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాదేశ్ బ్యాటర్ల తీరు మారలేదు. కేవలం 95 పరుగులకే మిగిలిన వికెట్లను సమర్పించుకుంది. దీంతో ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 100 లోపు పరుగులకే ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది. గత 21 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇలా ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు వంద లోపు ఆలౌట్ కాలేదు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి బంగ్లాదేశ్ కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలోనే ఇది అత్యల్ప మ్యాచ్ మొత్తం స్కోర్లలో ఒకటిగా నమోదైంది. రెండో ఇన్నింగ్స్‌లో శాంతో (31), ముష్ఫికర్ రహీమ్ (29 నాటౌట్) కాసేపు పోరాడినా జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించలేకపోయారు.

లిట్టన్ దాస్ పెయిర్.. మోమినుల్ చెత్త రికార్డు..

ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌటై ‘పెయిర్’ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాపై ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న నాల్గవ బంగ్లా బ్యాటర్‌గా నిలిచాడు. మరోవైపు సీనియర్ బ్యాటర్ మోమినుల్ హక్ రెండో ఇన్నింగ్స్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే స్టార్క్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో టెస్టుల్లో అత్యధికంగా 19 సార్లు డకౌట్ అయిన బంగ్లాదేశ్ ఆటగాడిగా మహ్మద్ అష్రాఫుల్ (16), ఖలీద్ అహ్మద్ (16)లను అధిగమించి అగ్రస్థానానికి చేరాడు.

మ్యాకే టెస్టు బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. నాణ్యమైన పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆ జట్టు బ్యాటర్ల సాంకేతిక లోపాలు, ఒత్తిడిని తట్టుకోలేని బలహీనతలు ఈ ఘోర పరాభవంతో మరోసారి స్పష్టంగా బయటపడ్డాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us