Tollywood : అప్పుడు పవన్ కళ్యాణ్ హీరోయిన్.. కట్ చేస్తే.. మహేష్ బాబు సినిమాలో పవర్ ఫుల్ విలన్..
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ సరసన సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే మహేష్ బాబు సినిమాలో పవల్ ఫుల్ విలన్ పాత్ర పోషించి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?

తెలుగు సినీ పరిశ్రమలో 90వ దశకం చివరలో, 2000ల ఆరంభంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన నటీమణులలో రాశి ఒకరు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కథానాయికగా ఎదిగిన రాశి.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు హోమ్లీ పాత్రలే కాదు గ్లామరస్ రోల్స్, అలాగే స్పెషల్ సాంగ్స్ చేస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది రాశి. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రాశి, మహేష్ బాబు చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అవును.. పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్లలో వచ్చిన విజయవంతమైన చిత్రాలలో ‘గోకులంలో సీత’ ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన రాశి కథానాయికగా నటించారు. ఇందులో వారిద్దరి కెమిస్ట్రీ, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘శుభాకాంక్షలు’, ‘పెళ్లి పందిరి’, ‘గోకులంలో సీత’ వంటి సినిమాలతో రాశి ఆ సమయంలో వరుస హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..
కమర్షియల్ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే రాశి తన కెరీర్‌లో విభిన్నమైన ప్రయోగాలకు సిద్ధమయ్యారు. దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘నిజం’ చిత్రంలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించగా, రాశి ఇందులో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా హీరోయిన్‌గా కనిపించే నటి, స్టార్ హీరో సినిమాలో నెగెటివ్ రోల్ చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ చిత్రం కోసం రాశి లుక్ పరంగా కూడా పలు మార్పులు చేసుకున్నారని, షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను ఆమె పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..
తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించిన రాశి, పాత్రల ఎంపికలో విభిన్నతను చూపారు. గ్లామర్, పెర్ఫార్మెన్స్‌తో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ నటించే ధైర్యం చేసిన నటిగా ఆమె సినీ ప్రస్థానంలో ప్రత్యేకంగా నిలుస్తారు. పవన్ కళ్యాణ్‌తో హీరోయిన్‌గా, మహేష్ బాబు చిత్రంలో విలన్‌గా కనిపించిన అరుదైన కాంబినేషన్‌తో రాశి పేరు సినీ వర్గాల్లో మరోసారి ఆసక్తికరంగా మారింది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బుల్లితెరపై సీరియల్స్ సైతం చేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రాశి..

Rasi
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..
