AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం, వెండి కొంటున్నారా..? మరో బాంబ్ పేల్చిన కియోసాకి..

బంగారం, వెండి, రాగి ధరలు పడిపోతున్నాయి. అత్యంత విలువైన వస్తువులుగా పరిగణించే బంగారం,వెండి ధరలు కనిష్ట స్థాయికి కుప్పకూలుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వీటిపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బంగారం, వెండి గురించి తన అంచనాలను ఎప్పటికప్పుడు రాబర్ట్ కియోసాకి వెల్లడిస్తూ ఉంటారు.

బంగారం, వెండి కొంటున్నారా..? మరో బాంబ్ పేల్చిన కియోసాకి..
Gold Price
Venkatrao Lella
|

Updated on: Nov 23, 2026 | 2:51 PM

Share

బంగారం, వెండి ధరలు కనిష్ట స్థాయికి పతనమవుతున్న క్రమంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి కీలక వ్యాఖ్యలు చేశారు. “నేను నిజమైన (ETFలు కాని) బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియంలను ఎందుకు కొంటున్నానో. సమస్య ఫెడ్‌తో మొదలవుతుంది. బ్లాక్‌రాక్ వంటి ప్రపంచ పెట్టుబడి బ్యాంకులు మన డబ్బు ద్వారా మన సంపదను దోచుకుంటున్నాయి. మన ప్రభుత్వాల నుండి ఎలాంటి సహాయం లేదు. యూఎస్ ట్రెజరీ నాయకులు, చేతకాని, ఉద్యోగ భద్రత కోసం పాకులాడే ప్రభుత్వ నాయకత్వం తమను తాము కాపాడుకుంటున్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఉద్యోగాన్ని, మీ పదవీ విరమణను కాదు. కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పనక్కర్లేదు. ఈ కారణాల వల్లే నేను ఎక్కువ బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం, రియల్ ఎస్టేట్, చమురును కొంటున్నాను అంటూ రాబర్ట్ కియోసాకి తెలిపారు.

“ట్రిలియన్ అంటే 1 తర్వాత 12 సున్నాలు. $1,000,000,000,000 యూఎస్ డాలర్లు. ప్రతి 90 రోజులకు $1 ట్రిలియన్‌ను ముద్రిస్తున్నాయి. క్వాడ్రిలియన్ అంటే 1 తర్వాత 15 సున్నాలు. డెరివేటివ్స్ మార్కెట్‌ను క్వాడ్రిలియన్లలో కొలుస్తారు. 2008లో “సబ్-ప్రైమ్ మార్ట్‌గేజ్” డెరివేటివ్స్ మార్కెట్ కుప్పకూలినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దానితో పాటే దాదాపుగా పతనమైంది. మనం ఇప్పుడు జారుకుంటున్న ఈ పతనం 2008 కంటే చాలా పెద్దది. బహుశా ఇది ఒక ప్రపంచ ఆర్థిక మాంద్యం కావచ్చు. నేను చెప్పింది తప్పని ఆశిస్తున్నాను. కానీ ఒకవేళ నేను చెప్పింది నిజమైతే బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథేరియం నన్ను “అతి సంపన్నుల” కోవలోకి నెట్టేస్తాయి. భారీ ముద్రణ ప్రారంభం కాబోతోంది. మీరు నిమిషానికి $1 ఖర్చు చేస్తే, $1 ట్రిలియన్ ఖర్చు చేయడానికి 34,000 సంవత్సరాలు పడుతుంది. ఫెడ్, ట్రెజరీకి $1 ట్రిలియన్ ముద్రించడానికి నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుంది. 2026 నాటికి అమెరికా $49 ట్రిలియన్ల అప్పులో ఉంటుంది. అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. AI, ఉద్యోగ భద్రతను ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా తినేయబోతోంది. యూరప్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. 2002లో ‘రిచ్ డాడ్స్ ప్రొఫెసీ’లో నేను దీనిని ముందే ఊహించాను. ఆ హెచ్చరికలను పాటించిన వారు అతి సంపన్నులు కాబోతున్నారు” అంటూ కియోసాకి స్పష్టం చేశారు.

“ఈ సంక్షోభం తర్వాత మీరేం చేయబోతున్నారు? మరో డిగ్రీ కోసం తిరిగి చదువుకోవడానికి వెళ్తారా? జాగ్రత్త. మీరు నిజంగా మీ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటే ఒక క్యాష్‌ఫ్లో క్లబ్‌లో చేరండి. అవి ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో ఉన్నాయి. డబ్బు గురించి నేర్చుకోవడాన్ని ఇష్టపడే, తమ కోసం, తమ కుటుంబాల కోసం, తమ వ్యాపారాల కోసం వివేకవంతమైన చర్యలు తీసుకునే చురుకైన, సానుకూల వ్యక్తులను మీరు కలుసుకోవడానికి ఇది సరైన సమయం. మీకు దగ్గరలో ఉన్న క్యాష్‌ఫ్లో క్లబ్‌ను కనుగొనండి… లేదా మీ స్వంత గేమ్‌ను తయారు చేసుకుని, మీ స్వంత క్యాష్‌ఫ్లో క్లబ్‌ను ప్రారంభించండి. మీరు మీ అభ్యాసాన్ని గరిష్ఠ స్థాయికి పెంచుకోవాలనుకుంటే, దయచేసి నియమాలను పాటించండి. జాగ్రత్త… ఇవి సాధారణ సమయాలు కావు” కియోసాకి పేర్కొన్నారు.

Follow Us