Gold Price Today: భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా..?
Gold Price Today: బలహీనమైన అమెరికన్ డాలర్, అమెరికన్ ట్రెజరీ దిగుబడులలో హెచ్చుతగ్గులు, సురక్షిత పెట్టుబడులకు డిమాండ్, అమెరికన్ ద్రవ్య విధానంపై అంచనాలు విలువైన లోహాల ధరలకు మద్దతునిచ్చాయి. ఇరాన్‌పై అమెరికా విధించే అవకాశం ఉన్న ఆంక్షల నేపథ్యంలో పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణంపై..

Gold, Silver Price Today: మళ్లీ గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు వెళ్లగా, ఇప్పుడు అమాంతంగా పెరిగిపోతున్నాయి. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇటీవల కిలో వెండి ధర రూ.1.35 లక్షల వరకు వెళ్లగా ఇప్పుడు ఇది కూడా రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. తాజాగా ఆగస్ట్ 24న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,490 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,490 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,230 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,640 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,490 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,490 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,490 వద్ద కొనసాగుతోంది.
- ఇక వెండి ధర విషయానిస్తే.. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో కిలో వెండి ధర రూ.2,69,900 వద్ద ఉండగా, ఇతర ప్రాంతాల్లో రూ.2,59,900 వద్ద ట్రేడవుతోంది.
- అయితే ఈ ఏడాది జనవరిలో భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.1.80 లక్షల రికార్డు స్థాయికి చేరుకుంది. వెండి ధర కిలోగ్రాముకు రూ.4.25 లక్షలకు పెరిగింది.
బంగారం, వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
బలహీనమైన అమెరికన్ డాలర్, అమెరికన్ ట్రెజరీ దిగుబడులలో హెచ్చుతగ్గులు, సురక్షిత పెట్టుబడులకు డిమాండ్, అమెరికన్ ద్రవ్య విధానంపై అంచనాలు విలువైన లోహాల ధరలకు మద్దతునిచ్చాయి. ఇరాన్‌పై అమెరికా విధించే అవకాశం ఉన్న ఆంక్షల నేపథ్యంలో పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ఆందోళనలను కూడా పెంచాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో బలహీనమైన డాలర్ విలువైన లోహాలకు అదనపు మద్దతును అందించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
