AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో ఐకూ ఇయర్‌‌బడ్స్‌.. ధర తెలిస్తే నిజంగానే పిచ్చెక్కిపోద్ది

iQOO Buds True Wireless Stereo Earbuds.. భారత మార్కెట్లో తన ఆడియో ఉత్పత్తుల విభాగాన్ని ఐక్యూ మరింత పెంచుకునే విధానంలో భాగంగా iQOO Z11 స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త iQOO బడ్స్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలోనే మెరుగైన సౌండ్, సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త గ్యాడ్జెట్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

50 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో ఐకూ ఇయర్‌‌బడ్స్‌.. ధర తెలిస్తే నిజంగానే పిచ్చెక్కిపోద్ది
Iqoo Buds True Wireless Stereo Earbuds
Nikhil
|

Updated on: Aug 24, 2026 | 7:40 AM

Share

భారత మార్కెట్లో తన ఆడియో ఉత్పత్తుల విభాగాన్ని ఐక్యూ (iQOO) మరింత పెంచుకునే విధానంలో భాగంగా.. iQOO Z11 స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త iQOO బడ్స్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ (TWS)ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలోనే మెరుగైన సౌండ్, సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్, మొబైల్ గేమింగ్ కోసం అల్ట్రా-లో లేటెన్సీ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. మొబైల్ గేమింగ్ ప్రియులను, మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఐకూ సంస్థ సరికొత్త బడ్జెట్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అల్ట్రా-లో లేటెన్సీ, భారీ బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ కొత్త ఆడియో డివైజ్ వివరాలను తెలుసుకుందాం.

ఆడియో ఫీచర్లు

iQOO బడ్స్ లో 10mm హై-రిజల్యూషన్ మూవింగ్ కాయిల్ డ్రైవర్‌ను అందించారు. PU + PEEK డయాఫ్రాగమ్‌ను ఉపయోగించడం ద్వారా హార్మోనిక్ డిస్టార్షన్‌ను 2% కంటే తక్కువగా ఉంచేలా రూపొందించారు. “గోల్డెన్ ఇయర్స్ అకౌస్టిక్స్” టీమ్ సహకారంతో ఇయర్‌బడ్స్ సౌండ్‌ను ట్యూన్ చేశారు. ఇందులో DeepX 4.0 సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. మెగా బాస్, క్లియర్ వాయిస్, క్లియర్ హై పిచ్ తో పాటు ప్రత్యేకంగా ఆడియో బుక్ మోడ్ కూడా అందించారు. స్పేషియల్ ఆడియో కోసం నాలుగు ప్రీసెట్లు అందించారు.

థియేటర్, కన్సర్ట్ హాల్, స్టూడియో, లైవ్ కన్సర్ట్ వంటి మోడ్‌లను ఎంచుకోవచ్చు. కాల్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించేందుకు AI ఆధారిత డ్యూయల్-మైక్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందించారు. అలాగే ఇందులో Bluetooth 6.1 కనెక్టివిటీని అందించారు. గూగుల్ ఫాస్ట్ పెయిర్, ఫైండ్ మై ఇయర్ ఫోన్స్, స్మార్ట్ టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

గేమింగ్ లేటెన్సీ

మొబైల్ గేమర్లను దృష్టిలో పెట్టుకుని iQOO బడ్స్ లో కేవలం 42ms లో-లేటెన్సీని అందించారు. ఇయర్‌బడ్స్‌లో ఒక్కొక్కదానిలో 53mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది. ఛార్జింగ్ కేస్‌లో 525mAh బ్యాటరీ ఉండగా, కేస్‌తో కలిపి మొత్తం బ్యాటరీ బ్యాకప్ 50 గంటల వరకు లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 4 గంటల వరకు ప్లేబ్యాక్ పొందవచ్చు. ఇయర్‌బడ్స్‌కు IP54 రేటింగ్ ఉంది. iQOO Buds ను ఫ్లేమ్ ఎల్లో కలర్‌లో విడుదల చేశారు. భారతదేశంలో దీని ధర రూ.1,899గా నిర్ణయించారు. ఆగస్టు 24, 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా అన్ని బ్యాంక్ కార్డులపై రూ.200 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Follow Us
50 గంటల బ్యాటరీతో ఐకూ బడ్స్.. స్పెషాలిటీస్‌ ఇవే
50 గంటల బ్యాటరీతో ఐకూ బడ్స్.. స్పెషాలిటీస్‌ ఇవే
52 బంతుల్లో విధ్వంసం.. సెలక్టర్లకు ధోని దోస్త్ వార్నింగ్
52 బంతుల్లో విధ్వంసం.. సెలక్టర్లకు ధోని దోస్త్ వార్నింగ్
ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువులు మృతి
ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువులు మృతి
మిలిటరీ-గ్రేడ్ మన్నికతో లావా బోల్ట్ ఎన్4 లైట్.. స్పెషాలిటీస్ ఇవే
మిలిటరీ-గ్రేడ్ మన్నికతో లావా బోల్ట్ ఎన్4 లైట్.. స్పెషాలిటీస్ ఇవే
మీరు చేసే ఆ తప్పుతో దోసెలు అంటుకుపోతున్నాయ్...హోటల్​ స్టైల్లో​
మీరు చేసే ఆ తప్పుతో దోసెలు అంటుకుపోతున్నాయ్...హోటల్​ స్టైల్లో​
విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
కాలేజీ విద్యార్థుల కోసం గూగుల్ AI ప్లస్ సూపర్​ ప్లాన్
కాలేజీ విద్యార్థుల కోసం గూగుల్ AI ప్లస్ సూపర్​ ప్లాన్
నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేక మొబిలిటీ వెహికల్.. పూర్తి వివరాలివే
నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేక మొబిలిటీ వెహికల్.. పూర్తి వివరాలివే
భర్తను చంపి కడుపు చీల్చి పేగులు సంచిలో వేసి..!
భర్తను చంపి కడుపు చీల్చి పేగులు సంచిలో వేసి..!
పొరపాటున కుళ్లిన గుడ్డు తింటే శరీరంలో ఏం జరగుతుందో తెలుసా..?
పొరపాటున కుళ్లిన గుడ్డు తింటే శరీరంలో ఏం జరగుతుందో తెలుసా..?