August 05, 2026
Subhash
స్మార్ట్‌ఫోన్‌లలో కొన్ని యాప్‌లు మీరు వాడకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ శక్తిని తీసుకుంటాయి. డేటా సింకింగ్, నిరంతర నోటిఫికేషన్ల వల్ల బ్యాటరీ శాతం వేగంగా తగ్గిపోతుంది.
సోషల్ మీడియా యాప్‌లు అత్యధికంగా బ్యాటరీని వినియోగించుకుంటాయి. ఇంటర్నెట్, లోకేషన్ సర్వీసులు, పుష్ నోటిఫికేషన్లు నిరంతరం యాక్టివ్‌గా ఉండటం వల్ల బ్యాటరీ వేగంగా ఖాళీ అవుతుంది.
వీడియో స్ట్రీమింగ్ యాప్‌లు ఎక్కువ సమయం డిస్‌ప్లే స్క్రీన్‌ను ఆన్‌లో ఉంచుతాయి. హై-రిజల్యూషన్ వీడియోలను ప్లే చేయడం వల్ల ప్రాసెసర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో బ్యాటరీ శాతం తగ్గుతుంది.
భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమింగ్ యాప్‌లు అత్యంత వేగంగా బ్యాటరీని ఖాళీ చేస్తాయి. GPU, CPU గరిష్ట స్థాయి సామర్థ్యంతో పనిచేయడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. దీంతో బ్యాటరీ వేగంగా తగ్గుతాయి.
GPS నేవిగేషన్ యాప్‌లు రియల్-టైమ్‌లో మీ స్థానాన్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. జిపిఎస్ ఉపగ్రహాల సిగ్నల్స్, మొబైల్ డేటాను ఒకేసారి వాడటం వల్ల బ్యాటరీ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.
మెసేజింగ్ యాప్‌లు ఎప్పటికప్పుడు మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లను పొందేందుకు నిరంతరం యాక్టివ్‌గా ఉంటాయి. ఆటో-మీడియా డౌన్‌లోడ్ ఆన్ చేసి ఉంటే బ్యాటరీ , డేటా రెండూ వేగంగా ఖర్చవుతాయి.
బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు, ఉపయోగంలో లేని యాప్‌లను క్లోజ్ చేయండి. యాప్‌ల బ్యాక్‌గ్రౌండ్ డేటా, పరిమితులను సెట్టింగ్స్‌లో నియంత్రించండి.
బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు లేదా ఎల్లప్పుడూ బ్యాటరీ సేవర్ / డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తే ఛార్జింగ్ ఆదా చేయవచ్చు. అవసరం లేనప్పుడు జిపిఎస్, బ్లూటూత్, వైఫైలను ఆఫ్ చేయండి.