Weather Report: సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 40–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
